పరికిణీలో పాల మీగడ లాంటి మేనిఛాయతో ఆకట్టుకుంటున్న కయాదూ లోహర్!
ఇటీవల కాలంలో హీరోయిన్లు ఒకవైపు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే.. మరొకవైపు తమ సినిమా ప్రమోషన్స్ కూడా ఇదే ఇంస్టాగ్రామ్ ద్వారా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 2 Sept 2026 1:00 AM ISTఇటీవల కాలంలో హీరోయిన్లు ఒకవైపు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే.. మరొకవైపు తమ సినిమా ప్రమోషన్స్ కూడా ఇదే ఇంస్టాగ్రామ్ ద్వారా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. మరొకవైపు ఇలా గ్లామర్ తో కూడా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.. అలాంటి వారిలో కయాదు లోహర్ కూడా ఒకరు.
అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా గత కొన్ని రోజులుగా వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. నేడు సాంప్రదాయంగా లంగా వోణీలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. గోల్డెన్ కలర్ తో డిజైన్ చేసిన ఈ లంగా వోణీలో అమ్మడి అందం రెట్టింపు అవుతోందని చెప్పవచ్చు. జడ దువ్వుకొని కింద రిబ్బన్ కట్టుకొని చాలా అందంగా కనిపించింది కయాదు లోహర్. పాలమీగడ లాంటి మేని ఛాయతో మైమరిపింప చేసింది. ముఖ్యంగా ఒకవైపు ఈమె నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా అందంగా తయారయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్. ఇదివరకే వీరి కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక అందుకే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీ నుండి విడుదల చేసిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పైగా సినిమా నుండి విడుదల చేసిన పాటలు కూడా యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా అవకాశం అందుకుంది.
ఈ చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ , సంపూర్ణేష్ బాబు , తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఈ సినిమాతో కయాదు లోహర్ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశలు పెట్టుకుంది.. మరి ఆమెకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
కయాదు లోహర్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి ఐయామ్ గేమ్ అనే చిత్రంలో నటించింది. సూర్య 48వ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా వచ్చిన ఇమ్మోర్టల్ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది . ఇక అంతే కాదు మలయాళ చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. నిజానికి ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్ లు లభిస్తున్నప్పటికీ ఈమెకు హీరోయిన్గా వరుస అవకాశాలు లభిస్తూ ఉండడం గమనార్హం.
