ఫంకీ పాప.. నెక్స్ట్ ఏం చేస్తుందో..?
అనుదీప్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో కయదు లోహర్ గ్లామర్ తో పాటు యాక్టింగ్ లో కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు.
By: Ramesh Boddu | 10 Dec 2025 11:05 AM ISTడ్రాగన్ సినిమాతో యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది కయదు లోహర్. అమ్మడు తెలుగులో శ్రీ విష్ణుతో అల్లూరి సినిమా చేసింది. ఆ టైంలో అసలు మన ఆడియన్స్ ఆమెను గుర్తించలేదు కానీ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ హిట్ అవ్వడంతో కయదుకి తెలుగులో సూపర్ పాపులారిటీ వచ్చింది. వెంటనే అమ్మడికి విశ్వక్ సేన్ ఫంకీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అనుదీప్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో కయదు లోహర్ గ్లామర్ తో పాటు యాక్టింగ్ లో కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు.
కయదు లోహర్ ఆడియన్స్ ని ఇంప్రెస్..
ఫంకీ టీజర్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగా సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఐతే కయదు లోహర్ ఫంకీ తర్వాత నెక్స్ట్ టాలీవుడ్ మూవీ ఏదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే రవితేజతో ఒక సినిమా చేస్తుందన్న టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని తేలింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో కయదు నటిస్తుందని అన్నారు కానీ ఆ మూవీలో కయదు లోహర్ ప్లేస్ కాలేదు.
ఫంకీ పాప ఆ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఎంచుకోవాలని చూస్తుందో ఏమో కానీ విశ్వక్ సినిమా ఒక్కటి మాత్రమే తెలుగులో చేస్తుంది కయదు లోహర్. ఐతే ఆడియన్స్ లో ఆమెకున్న హాట్ ఇమేజ్ కి తెలుగులో ఎలా లేదన్నా ఒక ఐదారు సినిమాలు వెంట వెంటనే పడేలా ఉన్నాయి. ఐతే ఫంకీ హిట్ పడితే ఆ ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. ఫంకీలో కూడా కయదు తన గ్లామర్ షోతో ఆడియన్స్ ని బుట్టలో వేసే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది.
ఫంకీతో డబల్ క్రేజ్ తెచ్చుకోవాలని..
విశ్వక్ సేన్ కూడా ఫంకీతో ఒక మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అనుదీప్ డైరెక్షన్ లో సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ ఉన్నట్టే. కయదు కూడా అల్లూరి తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీతో డబల్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అదే జరిగితే మాత్రం ఫంకీతో కయదు తెలుగులో మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
కయదు ఓ పక్క తమిళ్ లో కూడా దూసుకెళ్తుంది. అమ్మడు తమిళ్ తో పాటు తెలుగులో తనకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఫంకీ హిట్ పడితే మాత్రం తెలుగులో కయదు బిజీ అయ్యే ఛాన్స్ కచ్చితంగా ఉంది. ఎలాగు టాలీవుడ్ లో హీరోయిన్స్ విషయంలో ఎప్పుడు లోటు ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా యువ హీరోలకు సరైన జోడీ కుదరట్లేదు. ఐతే ఇప్పుడు కయదు అలాంటి వారికి ఫస్ట్ ఆప్షన్ అయ్యేలా ఉంది. ఫంకీ సక్సెస్ తో తెలుగులో రెండో ఇన్నింగ్స్ అదరగొట్టేయాలని చూస్తుంది అమ్మడు.
