Begin typing your search above and press return to search.

ఛాన్సులు వచ్చినా ఏ లాభం!!

ఒక్క హిట్‌ తో హీరోయిన్‌ కు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు కూడా వస్తాయి.

By:  M Prashanth   |   23 Oct 2026 4:24 PM IST
ఛాన్సులు వచ్చినా ఏ లాభం!!
X

ఒక్క హిట్‌ తో హీరోయిన్‌ కు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు కూడా వస్తాయి. కానీ, ఆ అవకాశాలను ఎంతవరకు యూజ్ చేసుకున్నారన్నదే కెరీర్‌ లో ఇంపార్టెంట్. సినిమాలో స్టార్ హీరో పక్కన కనిపించినంత మాత్రాన సరిపోదు. తన రోల్ కూడా ప్రేక్షకులకు గుర్తుండాలి. ఇప్పుడు యంగ్ హీరోయిన్ కయాదు లోహార్ కెరీర్‌ ను చూస్తే అది క్లియర్ గా కనిపిస్తోంది.

మోడలింగ్‌ తో కెరీర్ స్టార్ట్ చేసిన కయాదు.. తక్కువ సమయంలోనే సౌత్ సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంది. కన్నడ, మలయాళ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తెలుగులో 'అల్లూరి'తో పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన 'డ్రాగన్' సినిమాతో మరింత క్రేజ్ సంపాదించింది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఆమెకు వచ్చాయి. అయితే, అవకాశాలు రావడం ఒకటైతే.. వాటితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మరో విషయం.

నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్'పై కయాదు చాలా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. కెరీర్‌ కు పెద్ద ప్లస్ అవుతుందని భావించి ఉండొచ్చు. కానీ, ఆ సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రపై విమర్శలు వచ్చాయి. సుబ్బలక్ష్మి రోల్ చూపించిన విధానం, ఇచ్చిన ఇంపార్టెన్స్ పై జోరుగా చర్చ జరిగింది. కొన్ని సీన్స్ విషయంలోనూ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సినిమాతో రావాల్సిన గుర్తింపు కంటే, పాత్ర చుట్టూ వచ్చిన విమర్శలే ఎక్కువగా కనిపించాయి.

ఒక హీరోయిన్‌ కు సినిమాలో ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు. కనిపించినంతసేపు కథకు ఎంత ఉపయోగపడ్డాం అనేదే మెయిన్. పాత్రకు సరైన బ్యాక్ డ్రాప్ ఉండాలి. కథలో తనకంటూ ఇంపార్టెన్స్ ఉండాలి. ముఖ్యంగా ప్రేక్షకులు ఆ పాత్రతో కనెక్ట్ అవ్వాలి. ఇవి లేకపోతే ఎంత పెద్ద సినిమా చేసినా అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. కయాదు విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

అయితే విమర్శలతో కయాదు కెరీర్ డౌన్ అయినట్లు కాదు. ఆమె చేతిలో ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. సూర్యతో చేస్తున్న సినిమా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మంజనాతి' వంటి ప్రాజెక్టులు ఆమెకు ఉపయోగపడొచ్చు. ఆ సినిమాల్లో మంచి పాత్రలు దక్కితే నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. రామ్ చరణ్, సుకుమార్ సినిమాల్లోనూ ఆమెకు అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పుడు కయాదు ముందున్న అసలు సవాలు మంచి సినిమాలు చేయడం మాత్రమే కాదు.. మంచి రోల్స్ ఎంచుకోవడం కూడా. గ్లామర్‌ కు మాత్రమే పరిమితం కాకుండా, యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న కథలను ఎంచుకుంటే తనపై వచ్చిన విమర్శలను తగ్గించుకోవచ్చు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేస్తేనే స్టార్ హీరోల సినిమాల్లో వచ్చిన అవకాశాలకు అసలైన వాల్యూ ఉంటుంది. లేదంటే ఎన్ని బడా మూవీలు చేసినా, ఎన్ని ఛాన్సులు వచ్చినా కెరీర్‌ కు ఎక్స్పెక్ట్ చేసినంత లాభం ఉండదు.