Begin typing your search above and press return to search.

కయాదు లోహర్ ఫ్యామిలీ స్టోరీ వైరల్.. పేరు వెనక అసలు అర్థం ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ ప్రస్తుతం నటించిన 'ప్యారడైజ్' సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Madhu Reddy   |   23 Sept 2026 3:09 PM IST
కయాదు లోహర్ ఫ్యామిలీ స్టోరీ వైరల్.. పేరు వెనక అసలు అర్థం ఇదే!
X

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ ప్రస్తుతం నటించిన 'ప్యారడైజ్' సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పేరు, కుటుంబ నేపథ్యం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. పురాణాల్లోని హిరణ్యకశిపుడి భార్య పేరు 'కయాదు' నుంచి తనకు ఈ పేరు పెట్టారని, తమ ఇంటిపేరు ఎలా మారిందో ఆమె చెప్పిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆవిశేషాలు చూద్దాం..

పేరు వెనుక ఉన్న పౌరాణిక కథ :

తన పేరు చాలా భిన్నంగా ఉండటానికి కారణమేంటో కయాదు లోహర్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు. హిందూ పురాణాలలో రాక్షస రాజు హిరణ్యకశిపుడి భార్య పేరు కయాదు. ఆ పౌరాణిక పేరు నచ్చి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తన తండ్రి తనకు 'కయాదు' అని నామకరణం చేశారని ఆమె తెలిపారు. ఇక తన పేరు వెనుక ఇంతటి ప్రత్యేకమైన పురాణ కథ ఉందనే విషయం చాలామందికి తెలియదని ఆమె చెప్పారు.

ఇంటిపేరు ఎలా మారిందంటే? :

కేవలం తన పేరు మాత్రమే కాకుండా, తమ కుటుంబ ఇంటిపేరు మారిన తీరును కూడా కయాదు పంచుకున్నారు. మొదట్లో తమ కుటుంబ అసలు ఇంటిపేరు 'కదైలి' అని వెల్లడించారు. అయితే ఇక తమ కుటుంబం అస్సాం రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని పూణేకు మారిన సమయంలో, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తన తండ్రి తమ ఇంటిపేరును 'లోహర్'గా మార్చుకున్నారని తెలిపారు.

మోడలింగ్ నుంచి వెండితెరకు :

సినిమా రంగానికి చెందిన ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కయాదు లోహర్, మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

తెలుగు ఎంట్రీ, కెరీర్ మలుపు :

ఇక యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన 'అల్లూరి' సినిమా ద్వారా కయాదు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం 'డ్రాగన్'లో పల్లవి పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే పెద్ద మలుపుగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రాబోయే 'ప్యారడైజ్' చిత్రంపైనే ఉన్నాయి.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో వరుస అవకాశాలు సాధిస్తున్న కయాదు లోహర్, తన పేరులోని ప్రత్యేకతతోనూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక విభిన్న భాషల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ భామకు రాబోయే 'ప్యారడైజ్' సినిమా మంచి బ్రేక్ ఇచ్చి మరిన్ని విజయాలను అందించాలని ఆశిద్దాం..