Begin typing your search above and press return to search.

నేపాలీ అమ్మాయిని.. పూణెలో పుట్టా!

ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తున్న పేర్లలో ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది క‌యాదు లోహ‌ర్.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 April 2026 2:00 PM IST
నేపాలీ అమ్మాయిని.. పూణెలో పుట్టా!
X

ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తున్న పేర్లలో ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది క‌యాదు లోహ‌ర్. టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం సౌత్ సినీ పరిశ్రమలో ఈ యంగ్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల ఆమె వ్యక్తిగత గుర్తింపు గురించి సోషల్ మీడియాలో వచ్చిన చర్చలకు కయాదు స్వయంగా ఇచ్చిన సమాధానం మరింత ఆకర్షణగా మారింది. తాను నేపాలీ అని, కానీ పూణెలో పుట్టి పెరిగాన‌ని, త‌మ పెద్దలు అస్సాంలో సెటిల‌య్యారంటూ తన మూలాలు, పెంపకం గురించి స్పష్టంగా చెప్పింది. ఈ క్లారిటీ ఆమె వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపుగా నిలిచిన ఫంకీ

ఇదిలా ఉండగా, సినిమాల పరంగా కూడా కయాదు కెరీర్ ఆసక్తికర మలుపు తిరిగింది. తెలుగులో ఆమె నటించిన ఫంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఫంకీ ఫ్లాప్ త‌ర్వాతే క‌యాదుకి మరింత గుర్తింపు రావడం గమనార్హం. ఇండస్ట్రీలో ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ బ్యూటీ, ఇప్పుడు స్టార్ దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి చేరుకుంది. అస్సాం నుంచి వచ్చి తక్కువ కాలంలోనే సౌత్‌లో గుర్తింపు తెచ్చుకోవడం ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైన అంశంగా చెప్పాలి.

డ్రాగ‌న్ తో కెరీర్ ట‌ర్న్

కయాదు కెరీర్లో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ స‌ర‌స‌న చేసిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా కీలక మలుపుగా నిలిచింది. ఆమె కెరీర్ ను ఈ సినిమాకు ముందు, తర్వాతగా విభజించవచ్చని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ద్వారా ఆమె నటనకు యూత్ నుంచి విపరీతమైన స్పందన లభించింది. అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని కయాదు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సౌత్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా క‌యాదు ఎదిగింది.

ప‌లు భాష‌ల్లో బిజీగా..

ప్రస్తుతం కయాదు చేతిలో ఏకంగా ఏడు సినిమాలుండటం విశేషం. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కథలో బలం ఉన్న ప్రాజెక్టులను ఎంచుకోవడం ద్వారా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకుంటోంది క‌యాదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అవకాశాలను ఉపయోగించుకుంటూ కెరీర్‌ను పటిష్టంగా నిర్మించుకుంటోంది అమ్మ‌డు. ముఖ్యంగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో ఆమె పాత్రపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా స‌క్సెస్ అయితే టాలీవుడ్‌లో కయాదు స్థాయి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే, వ్యక్తిగత గుర్తింపు నుంచి ప్రొఫెషనల్ గ్రోత్ వరకు ప్రతి అంశంలో కయాదు లోహర్ స్పష్టతతో ముందుకు సాగుతోంది. ఇండస్ట్రీలో స్థిరమైన స్థానం సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్న ఈ యంగ్ హీరోయిన్, రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్ రేసులో ముందంజలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.