Begin typing your search above and press return to search.

దీపావళి వేళ గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తున్న కయాదు లోహర్!

ఈ క్రమంలోనే మరొక యంగ్ బ్యూటీ కూడా ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

By:  Madhu Reddy   |   20 Oct 2025 9:07 PM IST
దీపావళి వేళ గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తున్న కయాదు లోహర్!
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. అందులో భాగంగానే తమ తోటి నటీనటులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ తమ ఇంట సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే..ఇంకొంతమంది ఈ దీపావళి వేళ చాలా అందంగా ముస్తాబయి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక యంగ్ బ్యూటీ కూడా ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

అందులో రెడ్ కలర్ లెహంగ ధరించిన ఈమె పండుగ వేళ అందాలను హైలెట్ చేస్తూ అభిమానులను కట్టిపడేసింది.ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ కయాదు లోహర్. డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఈమె.. అభిమానులను ఆకట్టుకునేలా దీపాలు వెలుగుల్లో తన మేనిఛాయను మరింత రెట్టింపు చేసుకుంది .

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈమె అందానికి ఫిదా అవుతూ.. లవ్ , ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కయాదు లోహర్.. అస్సాంలోని తేజ్ పూర్ లో 2000 ఏప్రిల్ 11న జన్మించింది పూనేలో నివసిస్తున్న ఈమె కామర్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కయాదు లోహర్ 2021 లో వచ్చిన కన్నడ చిత్రం మొగిలిపేట చిత్రంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది.

ఇకపోతే మలయాళంలో ఈమె నటించిన పాథోన్ పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది 19త్ సెంచరీ పేరుతో 2023 ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 2023 లో వచ్చిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది కయాదు లోహార్.

కయాదు లోహర్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే..

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'ఫంకీ' సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ సినిమా 2025 నవంబర్ 14న విడుదల కాబోతోంది. అలాగే వినయ్ గోవిందు దర్శకత్వం వహిస్తున్న మలయాళ సినిమా 'తారం'లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు జీవి ప్రకాష్ సరసన 'ఇమ్మోర్టల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కూడా నవంబర్లో విడుదల కాబోతోంది.. అలాగే టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'పల్లిచట్టంబి' అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ చిత్రంతోపాటు విశాల్ - సుందర్ సీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.