Begin typing your search above and press return to search.

ప్యార‌డైజ్ కోసం డ్రాగ‌న్ బ్యూటీ!

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   29 Sept 2025 3:22 PM IST
ప్యార‌డైజ్ కోసం డ్రాగ‌న్ బ్యూటీ!
X

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్ప‌టికే కొన్ని షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయితే ఇంత వ‌ర‌కూ హీరోయిన్ మాత్రం ఫైన‌ల్ అవ్వ‌లేదు. పాన్ ఇండియా సినిమా కావ‌డంతో? బాలీవుడ్ నుంచి ఫేమ‌స్ హీరోయిన్ తీసుకొస్తార‌ని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హీరోయిన్ ఎంట్రీ స‌న్నివేశాల్ని హోల్డ్ లో పెట్టి మిగ‌తా పార్ట్ చిత్రీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. `ద‌స‌రా` లా కాకుండా ఈ హిట్ తో నాని పాన్ ఇండియా స్టార్ అవ్వాల‌ని సంక‌ల్పించి మొద‌లు పెట్టిన ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది.

కాక పుట్టించే బ్యూటీ తెర‌పైకి:

కానీ హీరోయిన్ ఎవ‌రు? అన్న సంగ‌తి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. క‌నీసం ఎవ‌రూ ఊహ‌కి రాని హీరోయిన్ ని మేక‌ర్స్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్యార‌డైజ్ లో నానికి జోడీగా యువ నాయిక క‌యాదు లోహార్ నితీసుకుంటున్న‌ట్లు తెలిసింది. `రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్` తో క‌యాదు టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈసినిమాతో అమ్మ‌డు యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయింది. గ్లామ‌ర్ డాల్ గా ఫేమ‌స్ అయింది. ఒక్క సినిమాతోనే ఇంత క్రేజా అనుకునేంత గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయింది. ఈ భామ‌నే నానికి జోడీగా ఫైన‌ల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది.

హీరోయిన్ ఊహ‌కి కూడా రాలేదే!

ప్ర‌స్తుతం ఈ భామ త‌మిళ్ లో నాలుగైదు సినిమాలు చేస్తోంది. అవ‌న్నీ డ్రాగ‌న్ విజ‌యం త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాలే. అయితే నాని కి జోడీగా మాత్రం కయాదు పేరు తెర‌పైకి రావ‌డం మాత్రం షాకింగే. బాలీవుడ్ నుంచి ఓ పెద్ద హీరోయిన్ తీసుకొస్తార‌నే ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రిగింది. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండా హీరోయిన్ ని త‌క్కువ బ‌డ్జెట్ లోనే తేల్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో సందేహం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సినిమాని రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమితం చేస్తున్నారా? అందుకేనే త‌క్కువ పారితోషికంలో అందుబాటులో ఉన్న క‌యాదును హీరోయిన్ గా తీసుకుంటున్నారా? అన్న చ‌ర్చ నెట్టింట మొద‌లైంది.

రిలీజ్ వెనుక సీక్రెట్:

మ‌రి ప్యార‌డైజ్ రిలీజ్ వెనుక అస‌లు సంగ‌తేంటి? అన్న‌ది తేలాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతోంది. శ్రీకాంత్ మార్క్ ప‌క్కా మ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ . `ద‌స‌రా`ను మించి మాస్ ఎలివేష‌న్ ఉంటుంద‌ని ఇప్ప టికే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇక నాని వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. గత సినిమా `హిట్ 3` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.