Begin typing your search above and press return to search.

మ‌ల్టీస్టార‌ర్ లో మ‌రో భామ‌గా క‌యాదు లోహ‌ర్!

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం మరో భారీ మల్టీస్టారర్ సిద్ధం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   21 March 2026 7:00 PM IST
మ‌ల్టీస్టార‌ర్ లో మ‌రో భామ‌గా క‌యాదు లోహ‌ర్!
X

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం మరో భారీ మల్టీస్టారర్ సిద్ధం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోలుగా విక్ట‌రీ వెంక‌టేష్‌..నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రు చేతులు క‌ల‌ప‌డం ఇదే తొలిసారి కావ‌డంతో? ఆ కాంబినేష‌న్ లో సినిమా ఎలా ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా అనీల్ క‌థ‌తో పాటు ఆ క‌థ‌లో పాత్ర ధారుల‌పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెంకటేష్‌కు జోడీగా అభినేత్రి కీర్తి సురేష్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.

ఇద్ద‌రు ఇంత వ‌ర‌కూ జోడీ కట్ట‌లేదు. అనీల్ అందుకు ఛాన్స్ తీసుకున్నాడు. సీనియ‌ర్ హీరోల‌కు కీర్తి ఇప్పుడు పర్పెక్ట్ ఛాయిస్ గానూ చెప్పొచ్చు. దీంతో వెంకీ-కీర్తి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా వ‌ర్కౌట్ అవుతుంద‌ని భావిస్తున్నారంతా. దీంతో క‌ల్యాణ్ రామ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకునే నటి ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన త‌రుణంలో ఓ క్రేజీ బ్యూటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. అనీల్ అనిల్ రావిపూడి హాట్ బ్యూటీ కయాదు లోహర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

క‌యాదు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `అల్లూరి` వంటి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అటుపై `డ్రాగ‌న్` తో కుర్రాళ్ల‌లో క్రేజీ బ్యూటీ మారిపోయింది. ఆ విజ‌యం అమ్మ‌డికి మంచి ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది.దీంతో `ఫంకీ`, ` ది ప్యార‌డైజ్` లాంటి చిత్రాల్లో ఛాన్సులందుకుంది. `ఫంకీ` నిరాశ‌ప‌రిచినా? ప్యార‌డైజ్ పై మాత్రం భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇత‌ర భాష‌ల్లోనూ బిజీగా మారింది. అనీల్ ప్రాజెక్ట్ విష‌యానికి వ‌స్తే? సాధారణంగా అనీల్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఉండేలా పాత్రలను డిజైన్ చేస్తాడు. ఈ మల్టీస్టారర్‌లో కయాదు లోహర్ పాత్ర చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ గంభీరమైన పాత్రకు ఈమె పాత్ర చక్కగా సెట్ అవుతుందని అనీల్ బ‌లంగా న‌మ్ముతున్నాడుట‌. ప్రస్తుతం క‌యాదు లోహార్ పేరు చర్చల దశలోనే ఉంది.

కానీ ఖ‌రారు అవ్వ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని సోర్సెస్ ద్వారా తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్ కూడా ప్రధానంగా కామెడీ , ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని వినిపిస్తోంది.. కళ్యాణ్ రామ్ ఒక కొత్త లుక్‌లో, కాస్త ఫన్ జోనర్‌లో కనిపించబోతున్నారని టాక్. అనీల్ కు బాగా క‌లిసొచ్చిన జాన‌ర్ ఇది. క‌థ విష‌యంలో అనీల్ ఎప్పుడూ నేల విడిచి సాము చేయ‌డు. పాత క‌థ‌నే కొత్త ట్రీట్ మెంట్ తో చెప్ప‌డం అల‌వాటు. అత‌డి విజ‌య ర‌హ‌స్యం కూడా అదే.