Begin typing your search above and press return to search.

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం మరోసారి వార్తల్లో నిలిచింది. తమ పెళ్లి సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ఉద్యోగి షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఉద్యోగుల పట్ల ఆమె చూపిన అభిమానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   21 Nov 2026 12:02 PM IST
కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!
X

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె చేసే సందడి, జట్టును ప్రోత్సహించే తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తన పెళ్లి కారణంగా మరోసారి కావ్య మారన్ పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈసారి ఆమె ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను నవంబర్ 11న గ్రీక్‌లో వివాహం చేసుకున్నారు కావ్య మారన్. ఈ పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తమ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ వివాహ వేడుక సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు కూడా ప్రత్యేక బహుమతులు అందించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కావ్య మారన్ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సన్ గ్రూప్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు అందిన బహుమతిని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో బంగారు ఉంగరాన్ని కానుకగా ఇచ్చిన దాని గురించి వెల్లడించారు. ఈ క్రమంలో అందరూ ఉద్యోగుల పట్ల కావ్య మారన్ చూపించిన అభిమానానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒకవైపు కావ్య మారన్ పెళ్లి వార్తలు, మరోవైపు ఉద్యోగులకు బంగారు ఉంగరాలు ఇచ్చారనే ప్రచారం నెట్టింట ఆసక్తిని పెంచాయి. ఇక కావ్య మారన్, అనిరుధ్ వివాహానికి ... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. గ్రీక్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈరోజు చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.