ఖాన్ డాటర్‌ని మించి విలాసాల క్వీన్ ఈ అమ్మడు
భారతదేశంలో సంపన్న వారసురాళ్ల జీవనశైలి గురించి చర్చ వస్తే అందరి దృష్టి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ మీదకు వెళుతుంది.
By: Madhu Reddy | 23 April 2026 8:45 AM ISTభారతదేశంలో సంపన్న వారసురాళ్ల జీవనశైలి గురించి చర్చ వస్తే అందరి దృష్టి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ మీదకు వెళుతుంది. మరోవైపు ఐపీఎల్ వేదికగా తనదైన ముద్ర వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వీరిద్దరికీ ఒక పోలిక ఉంది.. అదే ఐపీఎల్ టీమ్స్. షారుఖ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంటే.. కావ్య తన సొంత జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ను ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఈ భామలిద్దరి లగ్జరీ కార్ల షికార్లను గమనిస్తే మాత్రం కావ్య మారన్ రేంజ్ చాలా భిన్నంగా.. అల్ట్రా లగ్జరీగా కనిపిస్తోంది.
సుహానా ఖాన్ తన తండ్రి సంపదకు తగ్గట్టుగానే విలాసవంతమైన కార్లలో సందడి చేస్తుంటారు. ఆమె గ్యారేజీలో దాదాపు రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ GLE 43 ఏఎంజీ కూపే, రూ. 29 లక్షల ఖరీదైన జీప్ కంపాస్, తండ్రి బహుమతిగా ఇచ్చిన రూ. 70 లక్షల విలువైన ఆడి A6 వంటి కార్లు ఉన్నాయి. ఇవి ఒక యువ స్టార్‌కి ఉండాల్సిన హై-ఎండ్ అభిరుచిని ప్రతిబింబిస్తాయి. కానీ కావ్య మారన్ కార్ల కలెక్షన్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.
సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కావ్య మారన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 450 కోట్లు. ఈ అందాల భామ గ్యారేజీలో ఉన్న కార్లు కోట్లాది రూపాయల విలువైనవి. ముఖ్యంగా రూ. 12.2 కోట్ల ఖరీదైన `రోల్స్ రాయిస్ ఫాంటమ్` తన రాయల్టీకి నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం ఈ ఒక్క కారు ధరతో సుహానా ఖాన్ వద్ద ఉన్న కార్లన్నింటినీ కలిపినా సరిపోవంటే కావ్య రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కేవలం రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా... అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్‌లో పాపులర్ కార్లు కావ్య వద్ద ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన బెంట్లె బెంటాయగా, రూ. 4.5 కోట్ల ఖరీదైన ఫెరారీ రోమా వంటి స్పోర్ట్స్ కార్లలో తను ప్రయాణిస్తుంటారు. పర్యావరణ స్పృహను చాటుతూ రూ. 2.5 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ i7 ఎలక్ట్రిక్ కారును కూడా తన గ్యారేజీలో చేర్చుకున్నారు. ఈ స్థాయి కార్లు ప్రపంచంలోని అతికొద్ది మంది బిలియనీర్ల వద్ద మాత్రమే కనిపిస్తాయి.
ఖాన్ డాటర్ సుహానా ఖాన్ సినిమా సెలబ్రిటీగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంటే.. కావ్య మారన్ ఒక పవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా తన హోదాకు తగ్గట్టుగా అత్యంత ఖరీదైన జీవనశైలిని గడుపుతున్నారు. క్రికెట్ గ్రౌండ్‌లో టీమ్ ఓనర్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటారో... రోడ్ల మీద కూడా తన అల్ట్రా లగ్జరీ కార్లతో అంతే ఆకర్షణీయంగా కనిపిస్తారు కావ్య. ఈ ఇద్దరు సెలబ్రిటీ వారసురాళ్లలో కార్ల ఎంపిక విషయంలో మాత్రం కావ్య మారన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
