Begin typing your search above and press return to search.

కావ్యా మారన్ - అనిరుధ్ రిలేషన్‌పై మరో బిగ్ అప్‌డేట్.. పెళ్లి తేదీ కూడా ఫిక్స్?

సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది.

By:  Madhu Reddy   |   17 Aug 2026 8:21 PM IST
కావ్యా మారన్ - అనిరుధ్ రిలేషన్‌పై మరో బిగ్ అప్‌డేట్.. పెళ్లి తేదీ కూడా ఫిక్స్?
X

సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లికి సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో పలు ఆసక్తికరమైన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నవంబర్ 10న వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే బిగ్ అప్‌డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?:

తాజా ప్రచారం ప్రకారం.. నవంబర్ 10న గ్రీస్ వేదికగా కావ్యా మారన్, అనిరుధ్ వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొన్ని కథనాల ప్రకారం స్పెయిన్‌లో వివాహం చేసుకుని, ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుండగా, ఆ సినిమా రిలీజ్ పనులు పూర్తయిన వెంటనే అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నారట.

న్యూయార్క్ పర్యటనతో మొదలైన లవ్ రూమర్స్:

గతేడాది న్యూయార్క్ నగరంలో కావ్యా మారన్, అనిరుధ్ జంటగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు అనిరుధ్ బాబాయ్ యంగ్ యాక్టర్ మహేంద్రన్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో వీరి బంధంపై ఆసక్తికరంగా వ్యాఖ్యానించడంతో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వీరి పెళ్లి ముహూర్తం నిజంగానే ఫిక్స్ అయిందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్న ఇరు కుటుంబాలు:

గతంలో ఇతర నటీమణులతో తనపై వచ్చిన ప్రేమ పుకార్లపై అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా స్పందించి, వాటిని ఖండించారు. అయితే కావ్య మారన్‌తో పెళ్లి వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నప్పటికీ, అనిరుధ్ కానీ లేదా సన్ గ్రూప్ వైపు నుంచి కావ్యా మారన్ కుటుంబం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరోవైపు అనిరుధ్ చేతిలో ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్', శింబు 'అరసన్', బాలకృష్ణ 'ఎన్.బి.కె 112' వంటి మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఇటు సినిమాలతో, అటు ఐపీఎల్ వేలం, సన్ నెట్‌వర్క్ పనులతో కావ్యా మారన్ కూడా ఎంతో బిజీగా ఉన్నారు. మరి వైరల్ అవుతున్న ఈ పెళ్లి వార్తలపై వీరు త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.