అనిరుధ్‌తో కావ్య పెళ్లిభాజా వేళ 24,600 కోట్ల వ్యాపార సామ్రాజ్యంపై చర్చ!
ఈ వివాహానికి సంబంధించి నవంబర్ నెలలో వేడుకలు జరగనుండగా ఆహ్వాన పత్రికలను అందిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
By: Sivaji Kontham | 17 Oct 2026 5:01 PM ISTభారతీయ మీడియా దిగ్గజాలలో ఒకరైన సన్ టీవీ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఈఓ అయిన కావ్య మారన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌తో ఈ యువ ఎంటర్ ప్రెన్యూర్ వివాహం జరగనుందనే వార్తలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే ఒకే కుటుంబంగా మారబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ వివాహానికి సంబంధించి నవంబర్ నెలలో వేడుకలు జరగనుండగా ఆహ్వాన పత్రికలను అందిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజా కథనాల ప్రకారం నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహం అత్యంత అట్టహాసంగా జరగనుండగా.. నవంబర్ 21న చెన్నైలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఇటీవల కావ్య మారన్ తల్లిదండ్రులు కళానిధి మారన్ - కావేరి మారన్‌లను కలిసిన ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ఈ వివాహ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే దీనిపై ఇటు కావ్య మారన్ గానీ, అటు అనిరుధ్ రవిచందర్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కావ్య మారన్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. హురూన్ రిచ్ లీస్ట్ 2026 ప్రకారం కళానిధి మారన్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 24,600 కోట్లుగా ఉంది. భారతదేశంలోని అత్యంత సంపన్నులైన మీడియా ఎంటర్ప్రెన్యూర్లలో ఆయన ఒకరుగా నిలిచారు. వీరి ప్రధాన వ్యాపార సామ్రాజ్యం సన్ టీవీ నెట్వర్క్ కాగా.. దీనితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత ప్రజాదరణ పొందిన `సన్‌రైజర్స్ హైదరాబాద్` ఫ్రాంచైజీని కూడా వీరు నిర్వహిస్తున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 17,500 కోట్ల నుంచి రూ. 18,400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కావ్య మారన్ వ్యక్తిగత విద్యాభ్యాసం - కెరీర్ విషయానికి వస్తే.. ఆమె లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2019లో సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తదనంతరం తన తండ్రి ఆధ్వర్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బాధ్యతలను భుజానెత్తుకుని.. ఆ జట్టు కో-ఓనర్‌గా .. సీఈఓగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కావ్య వ్యక్తిగత నికర విలువ సుమారు రూ. 409 కోట్లుగా ఉంది.
ఇక వరుడిగా ప్రచారంలో ఉన్న అనిరుధ్ రవిచందర్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ - బాలీవుడ్‌లోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అనిరుధ్ ఇటీవల సన్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన `జైలర్ 2` వంటి భారీ చిత్రానికి కూడా సంగీతం అందించారు. ఒకవైపు ప్రముఖ మీడియా సామ్రాజ్య వారసురాలు.. మరోవైపు స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఒకటవుతున్నారనే వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక అనిరుధ్ రవిచందర్ ఆర్థిక స్థితిగతుల విషయానికి వస్తే.. అతడి నికర ఆస్తుల విలువ సుమారు 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. లైవ్ కాన్సర్ట్‌లు, రాయల్టీలు, బ్రాండ్ ప్రకటనల ద్వారా అతడు భారీగా ఆర్జిస్తున్నారు. అలాగే టాప్ హీరోల చిత్రాల కోసం అనిరుధ్ ఒక్కో సినిమాకు సుమారు రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ అత్యధిక సంపాదన గల మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
