Begin typing your search above and press return to search.

మంచి సాయంత్రపు కాఫీలాంటి అమ్మాయి..!

ఇటీవల కావ్య తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె ఎరుపు రంగు చీర..ఆకుపచ్చ బ్లౌజ్‌లో చాలా సంప్రదాయంగా కనిపించింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Dec 2025 10:27 AM IST
మంచి సాయంత్రపు కాఫీలాంటి అమ్మాయి..!
X

సినీ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే అడుగుపెట్టిన నటీమణుల్లో కావ్య కళ్యాణ్‌రామ్ ఒకరు. చిన్నారి ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కనిపించిన ఆమెను ప్రేక్షకులు ఇప్పటికీ ఆ ముద్దు పాత్రలతో.. గుర్తు పెట్టుకుంటారు. కాలంతో పాటు ఆమె కూడా మారింది. నటనలో మెరుగులు దిద్దుకుంటూ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.




ఇటీవల కావ్య తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె ఎరుపు రంగు చీర..ఆకుపచ్చ బ్లౌజ్‌లో చాలా సంప్రదాయంగా కనిపించింది. ఎలాంటి హంగులు లేకుండా..సహజమైన లుక్‌లో ఆమె నిలబడిన తీరు చూస్తే ఎవరికైనా పాత రోజులు గుర్తొస్తాయి. ఇంటి ఆవరణలో..మృదువైన సూర్యకాంతి మధ్య ఆమె నిలబడి ఉన్న ఫోటో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలకు ఆమె..”సాయంత్రం ఒక ఫిల్టర్ కప్ కాఫీ కోసం సిద్ధంగా ఉన్నాను..” అనే క్యాప్షన్ కూడా పెట్టింది.




కావ్య సినీ ప్రయాణం చిన్నారి పాత్రలతోనే మొదలైంది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో బాల నటిగా కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ‘మసూద’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘బలగం’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో కావ్య నటన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సహజమైన నటనతో ఆమె చాలా మందికి ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది.




‘బలగం’ తర్వాత ‘ఉస్తాద్’ సినిమాలో ఆమె కనిపించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత కావ్య కొత్త సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అభిమానుల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఆమె గ్యాప్ తీసుకుందా.. లేక మంచి కథల కోసం ఎదురుచూస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కావ్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను దగ్గరగా ఉంచుకుంటుంది.