బిగ్ బాస్ ను కించపరిచిన రోహిత్.. నాగార్జున తీరుపై కౌశల్ రియాక్షన్!
తెలుగు బుల్లితెర నటుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో నటుడు కౌశల్ మండా కూడా ఒకరు.
By: Madhu Reddy | 5 Oct 2026 12:33 AM ISTతెలుగు బుల్లితెర నటుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో నటుడు కౌశల్ మండా కూడా ఒకరు. కౌశల్ పలు చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించడమే కాకుండా పలు చిత్రాలలో హీరోగా కూడా నటించారు. అంతేకాదు కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పించారు. ఈ క్రేజ్ తోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న కౌశల్ మండా తన ఆటతో అందరిని ఆకట్టుకొని విన్నర్ గా కూడా గెలిచారు. ఆ ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితుల కోసం సహాయం చేస్తామంటూ ప్రకటించారు కూడా..
నిరంతరం బిగ్ బాస్ షోల పైన పలు రకాల వీడియోలు చేస్తూ ఉంటారు కౌశల్.. అలాంటి కౌశల్ తాజాగా 10 వ సీజన్ పై అలాగే కామనర్ రోహిత్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు.. కౌశల్ మండా మాట్లాడుతూ.. " హౌస్ లో నాగార్జున గారు రోహిత్ మీద కోప్పడిన విధానాన్ని చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే.. మాక్సిమం నాగార్జున గారికి కోపం తక్కువే.. అదే.. నాగార్జున గారి ప్లేస్ లో ఎవరున్నా సరే టీవీలు బ్లాస్ట్ అయ్యేవి ఆ కోపానికి..
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మొదట కంటెస్టెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ అనేదే లేకపోతే.. నేను ఎవరనే విషయం ఎవరికీ తెలియదు. ఆ గుర్తింపు బిగ్ బాస్ మనకు పెట్టిన భిక్ష. హౌస్ లోకి ఎంటర్ అవ్వడం, మీరేంటో పదిమందికి తెలియడం, ప్రతిరోజు రెమ్యూనరేషన్ సంపాదించడం, గెలిస్తే క్యాష్ ప్రైజ్ తీసుకోవడం.. ఇవన్నీ వచ్చాయి అంటే ఇవన్నీ కూడా బిగ్ బాస్ వల్లే.. బిగ్ బాస్ అనేది లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదు.
అందుకే చెప్తున్న మొదట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి.. ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, వేరే కంటెస్టెంట్స్ ఖండించడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందే.. బిగ్ బాస్ దయవల్ల. కాబట్టి మీ అందరికీ చెబుతున్నది ఒకటే దయచేసి మీరు బిగ్బాస్ తో ఆడుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ ని ద్వేషించడం మొదలుపెట్టారో.. బిగ్ బాస్ ను ఏ రూపంలోనైనా సరే మీరు హేట్ చేశారో.. కచ్చితంగా ఆడియన్స్ మిమ్మల్ని ద్వేషిస్తారు.. మర్చిపోకండి. బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకుడు దీనిని గుర్తుంచుకోండి అంటూ తెలిపారు.
అసలేం జరిగిందనే విషయానికి వస్తే..రోహిత్ తోటి కంటెస్టెంట్స్ చరణ్, త్రిగుణ్ లతో మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ షోని ఉద్దేశించి బూతులు మాట్లాడారు. అలాగే అసభ్యకరమైన సైగలు చేశారు. వీకెండ్స్ లో భాగంగా రోహిత్ ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున తీవ్రంగా మండిపడుతూ.. బిగ్ బాస్ హౌస్ రూల్స్, బిగ్ బాస్ ను గౌరవించని వారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.. వెంటనే వెళ్లిపోండి అంటూ రోహిత్ ను గెట్ అవుట్ అంటూ బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇక తన తప్పు తెలుసుకున్న రోహిత్ బిగ్ బాస్ కి, నాగార్జునకు క్షమాపణలు చెప్పారు.
