Begin typing your search above and press return to search.

స్టార్‌ కపుల్‌ విషయంలో ఆ పుకారు నిజం కాబోతుందా..!

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ స్టార్‌ కపుల్స్‌లో కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.

By:  Ramesh Palla   |   15 Sept 2025 3:58 PM IST
స్టార్‌ కపుల్‌ విషయంలో ఆ పుకారు నిజం కాబోతుందా..!
X

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ స్టార్‌ కపుల్స్‌లో కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. వీరి ప్రేమ కథ, వీరి పెళ్లి బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరిగిన విషయాలు అనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా కత్రీనా కైఫ్ సుదీర్ఘమైన అనుభవం ఉంది. అంతే కాకుండా బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ ట్యాగ్‌ సైతం ఉంది. విక్కీ కౌశల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో యంగ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే కత్రీనా కైఫ్‌ తో ప్రేమలో పడ్డ సమయంలో, పెళ్లి సమయంలోనూ కాస్త ఆమెతో పోల్చితే క్రేజ్ పరంగా వెనకాలే ఉంటాడు. అందుకే సోషల్‌ మీడియాలో కత్రీనాకి ఇంతకు మించిన స్టార్‌ దొరకలేదా అంటూ విమర్శలు చేశారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ స్థాయి హీరోలను పెళ్లి చేసుకుంటే కేట్స్ మాత్రం ఇలా చేసిందనే విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ బిగ్‌ రూమర్‌..

వారందరికీ సరైన సమాధానం అన్నట్లుగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరూ చాలా సంతోషంగా లైఫ్‌ ను లీడ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో కత్రీనా కైఫ్‌ ఖచ్చితంగా స్టార్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అంతకు మించి విక్కీ కౌశల్‌ కి దక్కింది. వీరిద్దరి కాంబో సినిమా కోసం గతంలో వద్దు అన్నవారు, విమర్శించిన వారు ఎదురు చూస్తున్నారు. వీరి పెళ్లి అయ్యి దాదాపుగా నాలుగు ఏళ్లు అవుతోంది. బాలీవుడ్‌ స్టార్స్‌ లో కొద్ది మంది పెళ్లి అయిన వెంటనే పిల్లలకు వెళ్తున్నారు. పిల్లలు కన్న తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. కానీ పెళ్లి అయిన వెంటనే కత్రీనా వరుస సినిమాలు చేసింది. గత ఏడాది వచ్చిన మెరీ క్రిస్మస్‌ సినిమా వరకు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసింది. ఏడాదికి కనీసం ఒక్కటి చొప్పున ఈమె నుంచి సినిమాలు వచ్చాయి. కానీ గత ఏడాది కాలంగా కత్రీనా సినిమా విడుదల కాలేదు. అందుకు చాలా పుకార్లు వినిపించాయి.

తల్లి కాబోతున్న కత్రీనా కైఫ్‌..

కత్రీనా ప్రెగ్నెన్నీ కారణంగానే సినిమాలను చేయకుండా ఉంటుంది అంటూ గత ఏడాది నుంచే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కత్రీనా ప్రెగ్నెన్సీ విషయాన్ని స్వయంగా విక్కీ కౌశల్‌ను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ తల్లిదండ్రులం కావడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. ఆ విషయాన్ని తానే స్వయంగా జరిగినప్పుడు అనౌన్స్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేదు. కానీ ఈమధ్య కాలంలో మళ్లీ కత్రీనా గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన పుకార్లు నిజం అంటూ ఇప్పుడు బాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. కత్రీనా, విక్కీ కౌశల్‌ లు తల్లిదండ్రులు కావడానికి ఎక్కువ సమయం కూడా లేదని, రెండు నెలల్లోనే బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు, కత్రీనా అభిమానులు అందరూ సర్‌ప్రైజింగ్‌ వార్త వినబోతున్నారు అంటున్నారు.

విక్కీ కౌశల్‌ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు

ఇప్పటి వరకు కత్రీనా కైఫ్‌ కానీ, విక్కీ కౌశల్‌ కానీ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు చెప్పలేదు. పైగా ఈ మధ్య కాలంలో కత్రీనా బయట ఎక్కువగా కనిపించడం లేదు. సినిమాలు లేకున్నా ఆమె ఏవో ఒక కార్యక్రమాలకు హాజరు కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఆమె కనిపించడం లేదని, అందుకే కత్రీనా గర్భవతి అని చాలా మంది బలంగా వాదిస్తున్నారు. గతంలో విక్కీ కౌశల్‌ ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టి పారేశాడు. కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. కనుక మ్యాటర్‌ ఉందని చాలా బలంగా వినిపిస్తుంది. కత్రీనా అభిమానులు ఖచ్చితంగా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అనడంలో సందేహం లేదు. ప్రెగ్నెన్సీ తర్వాత కత్రీనా వెంటనే సినిమాలు చేయాలని, ఆమె నటించిన సినిమా కనీసం ఒక్కటి అయినా వచ్చే ఏడాదిలో విడుదల కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. మరి ఈసారి వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి.