సెలబ్రిటీల ప్రయివేట్ లైఫ్‌ని లీక్ చేసేది మీడియా ఫోటోగ్రాఫర్లేనా?
దాదాపు దశాబ్ధం క్రితం కత్రిన- రణబీర్ ఇబిజ బీచ్ లో ప్రయివేట్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు లీకవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 6 Sept 2025 1:00 AM ISTదాదాపు దశాబ్ధం క్రితం కత్రిన- రణబీర్ ఇబిజ బీచ్ లో ప్రయివేట్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు లీకవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీచ్ లో కత్రిన, రణబీర్ ఆల్మోస్ట్ అర్థనగ్నంగా దర్శనమిచ్చారు. కత్రిన బికినీ ధరించి హా* గా కనిపించగా, రణబీర్ షార్ట్ ధరించి కనిపించాడు. ఇద్దరూ సాయం సంధ్య వేళ జలకాలాటలకు సిద్ధమైనప్పుడు ఆ ఇద్దరినీ రహస్యంగా కెమెరాల్లో బంధించి ఎవరో ప్రబుద్ధుడు లీక్ చేయడంతో బాలీవుడ్ మీడియా పండుగు చేసుకుంది.
అయితే ఈ ఫోటోలు తీసినది ఎవరో ఇప్పటికీ తెలియదు. నిరంతరం కెమెరాలతో నీడలా వెంటాడే బాలీవుడ్ మీడియా పనే ఇది అని అంతా భావించారు. కానీ ఇది కచ్ఛితంగా సెలబ్రిటీలను కవర్ చేసే ఫోటో జర్నలిస్ట్ పని కాదని నాటి త్రోబ్యాక్ మ్యాటర్ గురించి ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ ఓ పాడ్ కాస్ట్ లో చెప్పారు.
విక్కీ కౌశల్ ఇంట్లో కత్రిన దీపావళి పండుగకు వెళ్లినప్పటి ఫోటోలను మొదటగా లీక్ చేసింది తానేనని చెప్పిన మానవ్, ఆదిత్యా రాయ్ కపూర్ - అనన్య పాండే డేటింగ్ కి సంబంధించిన ఫోటోలను తీసినది కూడా తానేనని అంగీకరించాడు. కానీ కత్రిన- రణబీర్ ప్రయివేట్ ఫోటోలను తాను లీక్ చేయలేదని అన్నాడు. తాను మాత్రమే కాదు మీడియా ఫోటోజర్నలిస్ట్ ఎవరూ వీటిని లీక్ చేయలేదని కూడా తెలిపారు. ఆ ఘటన తర్వాత అలాంటి ఫోటోలు ఏవీ ఇప్పటివరకూ లీక్ కాలేదని కూడా మానవ్ మంగ్లానీ వెల్లడించారు.
నిజానికి 2013లో కత్రిన- రణబీర్ జంట డేటింగ్ లో ఉన్నప్పుడు ఇబిజ లో బీచ్ పార్టీని ఆస్వాధించినప్పటి ఘటన ఇది. ఆ సమయంలో ఈ జంట ప్రయివేట్ లైఫ్ ని మీడియాకు లీక్ చేయగా, దానిపై ఆ ఇద్దరూ ఘాటుగా స్పందించారు. సెలబ్రిటీల వ్యక్తిగత, ప్రయివేట్ లైఫ్ ని గౌరవించాలని కత్రిన వ్యాఖ్యానించగా, ఇలా మీడియా హద్దులు దాటిపోవడం సరికాదని రణబీర్ కపూర్ ఆగ్రహించారు.
ఆ తర్వాత కథలు తెలిసినదే. అప్పటికే దీపిక నుంచి రణబీర్ విడిపోయే పరిస్థితి. ఆ సమయంలో కత్రినతో ప్రయివేట్ ఫోటోల లీక్ తో దీపికతో రణబీర్ డేట్ ముగిసింది. కత్రిన నుంచి అతడు తర్వాత విడిపోయాడు. కత్రిన, దీపిక ఇద్దరి నుంచి విడిపోయిన రణబీర్ ఆ తర్వాత ఆలియాతో లవ్ లో పడి పెళ్లాడిన సంగతి తెలిసిందే. కత్రిన తన సహనటుడు విక్కీ కౌశల్ తో ప్రేమలో పడి అతడిని పెళ్లాడేసింది. ఆలియాకు రాహా కపూర్ అనే క్యూట్ డాటర్ ఉంది. కత్రిన త్వరలోనే శుభవార్త చెబుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆలియా, కత్రిన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
