లూజు చొక్కాలో కత్రిన.. ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్?
2025 ఆరంభం నుంచి కత్రినపై ఈ తరహా రూమర్లు ఉన్నాయి. కత్రిన- విక్కీ విహారయాత్రలో ఉన్నప్పుడు ఇలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి.
By: Sivaji Kontham | 1 Aug 2025 11:56 PM ISTలూజు చొక్కా తొడుక్కుంటే ఫ్రెగ్నెన్సీ అని అర్థమా? ఎవరైనా సెలబ్రిటీ లూజు చొక్కా, నడుము కొలతను మించిన ట్రాక్ ఫ్యాంటు తొడుక్కుని కనిపిస్తే కచ్ఛితంగా దీనిని గర్భధారణగా నిర్ధారించవచ్చా? చాలా సందర్భాల్లో కథానాయికల తీరు తెన్నులను పరిశీలించి, వారు ధరించిన దుస్తుల ఆధారంగా దుష్ట కన్ను అన్ని విషయాలను కనిపెట్టేస్తుంటుంది. ఇప్పుడు అలానే, కత్రిన ఫ్రెగ్నెంట్ అని కనిపెట్టేసారు కొందరు ప్రబుద్ధులు.
ఆరు నెలలుగా రూమర్లు..
2025 ఆరంభం నుంచి కత్రినపై ఈ తరహా రూమర్లు ఉన్నాయి. కత్రిన- విక్కీ విహారయాత్రలో ఉన్నప్పుడు ఇలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. విహార యాత్రలో కత్రినా పోల్కా డాట్ డ్రెస్ లో ఉన్న వీడియో అంతర్జాలంలో వైరల్ అయింది. అనుష్క శర్మ గర్భధారణ సమయంలో ఇలాంటి దుస్తులను ధరించింది! అంటూ కత్రిన ఫ్రెగ్నెన్సీపై ప్రచారం సాగించారు.
అలా కనబడితే సందేహాలు:
తాజా వీడియో క్లిప్‌లో విక్కీ - కత్రిన తమ కారును పార్క్ చేసిన తర్వాత ముంబైలోని ఫెర్రీ పోర్టు వైపు వెళుతూ కనిపించారు. ఈ సమయంలో అలీబాగ్‌కు ఈ జంట ఎందుకు వెళుతున్నట్టు? అంటూ అందరూ సందేహంగా చూసారు. విక్కీ తెల్లటి చొక్కా - బ్లూ డెనిమ్ జీన్స్‌తో రొటీన్ లుక్‌లో కనిపించగా, కత్రినా మ్యాచింగ్ ప్యాంటు, భారీ లూజు ఉన్న తెల్లటి చొక్కాను ధరించి ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కత్రిన లూజ్ చొక్కా చూడగానే గర్భధారణ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.
ఆనందమయ జీవితం:
విక్కీ - కత్రిన జంట నడుమ అన్యోన్యత అన్నివేళలా స్ఫూర్తి. పండుగలు, విహారయాత్రల్లో తన భర్తతో కత్రిన ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. విక్కీ కుటుంబ సభ్యులతో కోడలు పిల్ల కత్రిన కైఫ్ ఎంతో హుందాగా, ప్రేమగా నడుచుకుంటుంది. అందమైన కుటుంబ జీవనంలోని సరిగమల్ని ఆస్వాధిస్తూ, ఆనందకర జీవితాన్ని ఈ జంట ఆస్వాధిస్తోంది.
వరుసగా క్రేజీ చిత్రాలతో బిజీ:
విక్కీ కౌశల్ చివరిసారిగా లక్ష్మణ్ ఉటేకర్ `చావా`లో కనిపించాడు. శంభాజీ మహారాజ్ కథతో రూపొందించిన వారియర్ డ్రామా ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 800కోట్లు వసూలు చేసింది. తదుపరి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్`లో రణబీర్ కపూర్ , అలియా భట్‌లతో కలిసి విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. `మహావతార్` అనే భారీ చిత్రంలోను విక్కీ నటించబోతున్నాడు. ఇది 2026 క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. `మెర్రీ క్రిస్మస్` తర్వాత కత్రిన నటించే తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
