Begin typing your search above and press return to search.

క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!

ఈ కవర్ షూట్‌లో కత్రిన ఫ్యాషన్ సెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రాయల్ వైట్ అండ్ సిల్వర్ ఎత్నిక్ వేర్‌కి ఆభరణాల ఎంపిక ఎంతో రీచ్‌గా ఉంది.

By:  Sivaji Kontham   |   29 Oct 2026 1:00 AM IST
క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!
X

కత్రిన కైఫ్‌ను అభిమానులు ఎందుకు దేవతాసుందరిగా, టైమ్‌లెస్ బ్యూటీగా ఆరాధిస్తారో మరోసారి రుజువు చేసింది ఈ తాజా `వోగ్ ఇండియా` కవర్ షూట్. అభూ జానీ సందీప్ ఖోస్లా డిజైనర్ డ్రెస్.. దానికి తగ్గట్టుగా అమర్చిన పార ట్రెడిష‌న‌ల్ మోడరన్ కాంబినేషన్ జ్యూవెలరీలో ఈ బ్యూటీ రాచరికపు క‌న్నె సిరిలా మెరిసిపోయింది. దశాబ్దాలు గడుస్తున్నా తన గ్లామర్, డిగ్నిటీ, ప్లాటినం బాడీ లాంగ్వేజ్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలో క్యాట్ ఐకానిక్ స్టాండర్డ్స్‌ను కంటిన్యూ చేస్తోంది. ఈ వోగ్ కవర్ పేజీలో కత్రిన ప్రదర్శించిన ఎలిగెన్స్, డివైన్ ప్రెజెన్స్ త‌న‌ ప్రతిష్టను మరింత పెంచాయి.

ఈ కవర్ షూట్‌లో కత్రిన ఫ్యాషన్ సెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రాయల్ వైట్ అండ్ సిల్వర్ ఎత్నిక్ వేర్‌కి ఆభరణాల ఎంపిక ఎంతో రీచ్‌గా ఉంది. ఎంపిక చేసుకున్న‌ ఇయ‌ర్ రింగ్స్, సిల్వర్ గాజులు క్లాసిక్ స్టైల్ క‌ పూర్తి రూపానిచ్చాయి. మినిమల్ మేకప్, నాచురల్ హెయిర్‌స్టైలింగ్ ద్వారా ``అందం అనేది కష్టపడి సాధించేది మాత్రమే కాదు.. మనసులో నుంచి పొంగిపొర్లే సహజమైన ఆనందం`` అనే విషయాన్ని స్పష్టంగా చాటిచెప్పారు.

గడిచిన కొద్దికాలంలో కత్రిన వ్యక్తిగత జీవితంలో విక్కీ కౌశల్‌తో వైవాహిక బంధం.. అలాగే తల్లిగా బాధ్యతల్లో వచ్చిన మార్పులు త‌న‌లో ఒక కొత్త పరిపక్వతను, మానసిక శాంతిని నింపాయి. `మామ్` అయ్యాక కత్రిన ముఖంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, పరిపూర్ణత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను పాటిస్తూనే.. కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా తన ఆలోచనా విధానానికి తగ్గట్టుగా వైవిధ్యమైన పాత్రలను మాత్రమే ఎంచుకునే ధోరణి ని కొన‌సాగిస్తోంది.

ప్రస్తుతం కత్రిన కేవలం నటనకే పరిమితం కాకుండా తన సొంత బ్యూటీ బ్రాండ్ `కేబ్యూటీ` బిజినెస్‌ను విస్తరించడంపైనా.. ఎంపిక చేసిన ప్రాజెక్ట్‌లపైనా దృష్టి పెట్టారు. `మెర్రీ క్రిస్మస్`, `టైగర్ 3` సినిమాలతో మెప్పించిన త‌ర్వాత‌ ఈ ఏడాది కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఫర్హాన్‌ అఖ్తర్‌ కాంబినేషన్‌లో అనుకున్న భారీ ప్రాజెక్ట్‌తో పాటు పలు ఆసక్తికరమైన కథలు చర్చల దశలో ఉన్నాయి. మ‌ల్లీశ్వ‌రిగా తెలుగు ప్రజ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్న క‌త్రిన‌.. ఏజ్ లెస్ బ్యూటీగా వెలుగొందుతోంది. మామ్ అయ్యాక రూపం మారిపోయింద‌ని కొన్ని కామెంట్లు వినిపించినా.. తిరిగి కంబ్యాక్ ఎలా ఉంటుందో చూపిస్తోంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా త‌న గ్లామ‌ర్ కించిత్ చెద‌ర‌ద‌ని నిరూపిస్తోంది. ఎంతమంది కొత్త కథానాయికలు వచ్చినా.. తనదైన ప్రత్యేక శైలితో `దేవతాసుందరి`గా తన స్థానాన్ని కత్రిన ఎప్పటికీ చెక్కుచెదరకుండా కాపాడుకుంటోంది.