Begin typing your search above and press return to search.

అఫీషియల్ అనౌన్స్మెంట్: తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. పోస్ట్ వైరల్!

కానీ తాజాగా స్వయంగా కత్రినా కైఫ్ ప్రకటించడంతో అభిమానులు, సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   23 Sept 2025 12:56 PM IST
అఫీషియల్ అనౌన్స్మెంట్: తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. పోస్ట్ వైరల్!
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గత కొన్ని రోజులుగా తల్లి కాబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇది సినిమా షూటింగ్లో భాగమని కొంతమంది కొట్టి పారేశారు. కానీ తాజాగా స్వయంగా కత్రినా కైఫ్ ప్రకటించడంతో అభిమానులు, సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు కత్రినా కైఫ్ తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో కూడా షేర్ చేసింది. అందులో బేబీ బంప్ తో ఉన్న కత్రినా కైఫ్ ను ఆమె భర్త విక్కీ కౌశల్ ప్రేమగా పట్టుకొని మురిసిపోతున్నట్టుగా ఆ ఫోటోని షేర్ చేస్తూ.."మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది కత్రినా కైఫ్. మొత్తానికైతే ఈమె చేసిన అధికారిక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ వివాహ విషయానికి వస్తే.. 2021 డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్లో సాంప్రదాయ హిందూ వేడుకలో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతుండడంతో ఆ ఇంట సంబరాలు మిన్నంటాయని చెప్పవచ్చు.

కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె హిందీతో పాటు తెలుగు, మలయాళం చిత్రాలలో కూడా నటించింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె భారతదేశంలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకోవడం గమనార్హం. కత్రినా కైఫ్ సినిమాల విషయానికి వస్తే.. మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఈ సినిమా యావరేజ్ గా నిలవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే మైనే ప్యార్ క్యూ కియా ?, నమస్తే లండన్ వంటి సినిమాలు చేయగా.. ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. ఇటీవలే ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమాతో భారీ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు రణబీర్ కపూర్ ,ఆలియా భట్లతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈయన కెరియర్ విషయానికి వస్తే హిందీ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన నటనతో జాతీయ చలన చిత్ర పురస్కారం, ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ కుమారుడే విక్కీ కౌశల్. ముంబైలో జన్మించిన ఈయన తన నటనతో హిందీ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించారు. సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ త్వరలో తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని చెప్పవచ్చు.