Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత అవ‌కాశం పట్ల క్యాట్ ఆరాలు!

సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో షూటింగ్ షిఫ్ట్‌లు చాలా సుదీర్ఘంగా ఉంటాయనే టాక్ ఉన్నందున క‌త్రినా షెడ్యూల్ విషయంలో పుల్ క్లారిటీ అడుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   27 July 2026 11:12 AM IST
రెండు ద‌శాబ్దాల త‌ర్వాత అవ‌కాశం పట్ల క్యాట్ ఆరాలు!
X

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి కత్రినా కైఫ్. తాజాగా ఈ బ్యూటీ రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభ దశలో టాలీవుడ్‌లో నటిగా అడుగుపెట్టిన క‌త్రినా ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమయ్యారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `స్పిరిట్` లో కీలకమైన పాత్ర కోసం క్యాట్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

కత్రినా కైఫ్ టాలీవుడ్‌లో `మ‌ల్లీశ్వ‌రి` సినిమాతో పరిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత‌ బాల‌య్య సరసన `అల్లరి పిడుగు` చిత్రంలో న‌టించింది. ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తవుతోంది. ఆ చిత్రం తర్వాత క‌త్రినాకు తెలుగు నుంచి పలు అవకాశాలు వ‌చ్చినా? బాలీవుడ్‌లో బిజీగా ఉండటం తో తెలుగు సినిమాల్ని లైట్ తీసుకుంది. ఆ త‌ర్వాత కాలంలోనూ అమ్మ‌డికి మంచి అవకాశాలు వ‌చ్చాయి. అయినా బాలీవుడ్ కే ప‌రిమి త‌మైంది. తాజాగా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్ అగ్ర చిత్రంలో నటించే గొప్ప అవ‌కాశం అమ్మ‌డి ముందుంది.

`స్పిరిట్' చిత్రంలో భాగం చేసేందుకు కత్రినా కైఫ్‌తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఈ చిత్రంలో క్యాట్ ప్రత్యేకమైన పాత్రను ఆఫ‌ర్ చేస్తున్నారు. కథలో పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండటంతో పాటు..క‌త్రినా న‌టిస్తే ఆ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కంతో సందీప్ రెడ్డి ఉన్నాడు. దీంతో ఆమెను ఎలాగైనా? ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పాత్రకు సంబంధించి షూటింగ్ ఐదు రోజులపాటు ఉంటుందని సమాచారం. అయితే ఆ ఐదు రోజులు కూడా క‌త్రినాకు మ్యానేజ్ చేయ‌డం క‌ష్టంగా మారుతోందిట‌.

షూటింగ్ దినాలను మరింత తగ్గించాల్సిందిగా కోరుతున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో షూటింగ్ షిఫ్ట్‌లు చాలా సుదీర్ఘంగా ఉంటాయనే టాక్ ఉన్నందున క‌త్రినా షెడ్యూల్ విషయంలో పుల్ క్లారిటీ అడుగుతున్న‌ట్లు తెలుస్తోంది. పైగా సందీప్ టేకింగ్ కూడా స్లోగానే ఉంటుంది. ప‌ర్పెక్ష‌న్ కోసం కొన్ని సన్నివేశాల‌ను రోజుల త‌ర‌బ‌డి తీస్తాడ‌నే ఇమేజ్ ఉంది. ఈ సందేహాల‌న్నింటిని క‌త్రినా ముందుగానే నివృతి చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో కత్రినా కైఫ్ అడుగుతున్న షెడ్యూల్ సర్దుబాట్లకు సందీప్ అంగీక రిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

కత్రినా అనుకున్న విధంగా షూటింగ్ డేస్ కుదిరి, వర్కింగ్ అవర్స్ సౌకర్యవంతంగా ఉంటే? ప్రాజెక్ట్‌లో క‌త్రినా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. క‌త్రినా చివ‌రిగా `మేరీ క్రిస్మ‌స్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా ప్ర‌క‌టించ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాప్ లోనే క‌త్రినా గ‌ర్భం దాల్చ‌డం పండండి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం జ‌రిగింది.