ఆ స్టార్ కిడ్ పుట్టక ముందే అందరి దృష్టి...!
బాలీవుడ్‌లో అయినా మరే ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అయిన తల్లి లేదా తండ్రి అయితే మీడియా దృష్టి ఆకర్షించడం కామన్ విషయం.
By: Ramesh Palla | 14 Oct 2025 11:21 AM ISTబాలీవుడ్‌లో అయినా మరే ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అయిన తల్లి లేదా తండ్రి అయితే మీడియా దృష్టి ఆకర్షించడం కామన్ విషయం. అదే స్టార్ కపుల్ తల్లిదండ్రులు అయితే మీడియా ఫోకస్ అంతా ఆ పుట్టిన బేబీపై ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కియారా అద్వానీ తల్లి అయిన సమయంలో అంతకు ముందు ఆలియా భట్ బేబీకి జన్మనిచ్చిన సమయంలో మీడియాలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి గురించే కాకుండా అంతకు ముందు పలువురు స్టార్ హీరోయిన్స్ డెలివరీ సమయంలోనూ అదే జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక స్టార్ కపుల్ కిడ్ పుట్టక ముందు నుంచే వార్తల్లో నిలవడం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం తెల్సిందే. ఆమె భర్త విక్కీ కౌశల్ చేస్తున్న ప్రస్తుత సినిమాల కంటే వారికి పుట్టబోతున్న బిడ్డ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.
కత్రీనా, విక్కీ కౌశల్‌కి పుట్టబోయే బిడ్డ..
సోషల్ మీడియాలో ఉన్న వారి నుంచి మొదలుకుని జ్యోతిష్యులు, మీడియా వర్గాల వారు, నెంబర్స్ ఆధారంగా లైఫ్‌ను విశ్లేషించే వారు ఇలా చాలా రకాల మంది కత్రీనా కైఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు జన్మించబోతున్నది ఆడ బిడ్డ అని విశ్లేషిస్తున్నారు. ఆమె వయసు రీత్యా ఆడ బిడ్డ జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తే ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఎక్కువ శాతం హీరోయిన్స్ మొదటి కాన్పులో ఆడ బిడ్డకు జన్మనివ్వడం మనం గమనించవచ్చు. అందుకే కత్రీనా కైఫ్ సైతం ఖచ్చితంగా ఆడబిడ్డకు జన్మను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరూ విశ్లేషిస్తున్నారు. అందుకే కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కి పుట్టబోతున్న స్టార్ కిడ్ గురించి ఇప్పటి నుంచే మీడియాలో ప్రముఖంగా వార్తలు, కథనాలు, విశ్లేషణలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కత్రీనా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా పుట్టక ముందే పుట్టబోయేది ఆడ బిడ్డనా, మగ బిడ్డనా అంటూ తెగ చర్చ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ స్థాయిలో ఈ స్టార్ కపుల్ బిడ్డ కోసం మీడియా వర్గాల వారు, నెటిజన్స్, ఇండస్ట్రీకి చెందిన వారు ఎదురు చూడటం విశేషం. కత్రీనా కెరీర్ ఆరంభం నుంచి మీడియాలో ఏదో ఒక విషయంతో ఉండేది. ఇప్పుడు ఆమె బేబీ పుట్టక ముందు నుంచి వార్తల్లో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయం అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కత్రీనాకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఆమె ఫ్యాన్స్ చాలా మంది అమ్మాయి అయితే బాగుంటుంది అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. కత్రీనా అంత అందంగా బిడ్డ పుట్టాలని, ఆ పాప కూడా ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా నిలవాలని కత్రీనా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై కత్రీనా, విక్కీ కౌశల్‌లు స్పందించలేదు.
ఈ నెలలోనే కత్రీనా కైఫ్ డెలివరీ
కత్రీనా, విక్కీ కౌశల్‌లు సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని ఇరు కుటుంబాల సమక్షంలో 2021 చివర్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి కత్రీనా కైఫ్ తల్లికాబోతుందనే వార్తలు వస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన ఏడాది రెండేళ్లకే తల్లి అయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే కత్రీనా సైతం అదుగో తల్లి అని కొందరు, ఇదుగో ప్రెగ్నెన్సీ అని కొందరు తెగ మాట్లాడుకోవడం మనం చూశాం. ఎట్టకేలకు కత్రీనా తల్లి కాబోతుంది అనే విషయం వాస్తవం, ఈ నెలలోనే కత్రీనా బిడ్డకు జన్మనివ్వడం ఖాయం అని కూడా తేలిపోయింది. ప్రస్తుతానికి ఆమె పూర్తి విశ్రాంతిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కత్రీనా సినిమాలకు గత కొన్ని నెలలుగా బ్రేక్ తీసుకుంది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత షూటింగ్స్‌కు హాజరు అయ్యే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాదిలో కత్రీనా సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తల్లి అయిన తర్వాత కూడ ఆ హీరోయిన్‌గా బిజీగా ఉన్న హీరోయిన్స్‌ను చాలా మందిని చూస్తూ ఉన్నాం. కనుక కత్రీనా సైతం ఖచ్చితంగా డెలివరీ తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
