Begin typing your search above and press return to search.

ఆ ముసుగు తెర‌లు తొల‌గించేదెలా మామ్ క‌త్రిన‌?

మ‌ల్లీశ్వ‌రిగా తెలుగు లోగిళ్ల‌లో గొప్ప అభిమానం సంపాదించుకుంది కత్రినా కైఫ్. స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ని ప‌ళ్లాడిన క‌త్రిన చిన్నారి బాలుడు విహాన్ కౌశల్ (నెల‌లు)కి మామ్ అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   26 Feb 2026 9:43 AM IST
ఆ ముసుగు తెర‌లు తొల‌గించేదెలా మామ్ క‌త్రిన‌?
X

మ‌ల్లీశ్వ‌రిగా తెలుగు లోగిళ్ల‌లో గొప్ప అభిమానం సంపాదించుకుంది కత్రినా కైఫ్. స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ని ప‌ళ్లాడిన క‌త్రిన చిన్నారి బాలుడు విహాన్ కౌశల్ (నెల‌లు)కి మామ్ అన్న సంగ‌తి తెలిసిందే. విహాన్ పుట్టిన తర్వాత అంతా మారిపోయింది. క‌త్రిన గ్లామ్ అండ్ గ్లిప్ ప్ర‌పంచానికి దూరంగా కుమారుడితో స‌మ‌యాన్ని వెచ్చిస్తోంది. బాలుడి ఆల‌నాపాల‌నా చూసుకుంటూ మురిసిపోతున్న క‌త్రిన ఫోటోలు ఇంత‌కుముందు బ‌య‌ట‌కు వ‌చ్చినా కానీ, మొదటిసారి ఆరు బయట స్వేచ్ఛ‌గా వెళుతున్న‌ట్టు కనిపించింది. ప్ర‌స్తుతం దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. క‌త్రిన త‌న కార్ లో వెళుతూ ముసుగు (మాస్క్) ధరించి కనిపించడం వెనుక కార‌ణాలేమిటో అర్థం కాలేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ముసుగు వెన‌క ప్ర‌ధాన‌మైన కార‌ణ‌మే ఉంది. చాలామంది సెలబ్రిటీలు డెలివరీ తర్వాత తమను తాము, తమ బిడ్డను మీడియా కంటికి దూరంగా ఉంచాలని కోరుకుంటారు. కత్రినా కూడా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. ఆ మాస్క్ వెనుక ఉద్దేశం కేవలం గుర్తుపట్టకూడదని మాత్రమే కాకుండా, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం కూడా అయి ఉండవచ్చు.

కొందరు హీరోయిన్లు తల్లిగా మారిన తర్వాత తమ గ్లామర్ త‌గ్గితే దాంతో పాటే ఇండ‌స్ట్రీలో ఇమేజ్ తగ్గుతుందని భావిస్తారు. కానీ ప్రస్తుత ట్రెండ్ మారింది. కరీనా కపూర్, ఆలియా భట్, దీపికా పదుకొణె వంటి న‌టీమ‌ణులు తల్లి అయిన తర్వాత కూడా స్టార్‌డమ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. కత్రినా కూడా అదే బాటలో పయనిస్తుందా లేదా అనేది చూడాలి. బహుశా ఈ బ్యూటీ మళ్ళీ పూర్తి ఫిట్‌నెస్‌లోకి వచ్చాకే ప్రపంచానికి తన కొత్త లుక్ చూపించాలని ప్లాన్ చేస్తున్నారేమో!

బాధ్యతాయుతమైన తల్లిగా..

7 నవంబర్ 2025న విహాన్ పుట్టినప్పటి నుండి పూర్తిగా తన సమయాన్ని గారాల ప‌ట్టీ కోస‌మే కేటాయించింది. దాదాపు మూడు నెలల తర్వాత బయట కనిపిస్తూ.. కారులో నుండే నవ్వుతూ అభివాదం చేయడం చూస్తుంటే క‌త్రిన ఇంకా ఆ మాయా లోకం నుంచి బ‌య‌ట‌కు రాలేద‌నే అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా త‌న‌ను మాయ‌లోకి దించేసిన‌ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

సెట్ల‌లో ఎందుకు కనిపించడం లేదు?

మామ్ అయిన త‌ర్వాత కత్రినా ఇంకా తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై ఇటీవ‌ల దృష్టి సారించార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్వరలోనే తను ఒక పవర్‌ఫుల్ రోల్‌తో లేదా ఒక భారీ అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఏదేమైనా `మల్లీశ్వరి`గా మన గుండెల్లో నిలిచిపోయిన కత్రినా.. ఇప్పుడు `రియల్ లైఫ్ మమ్మీ`గా కనిపించడానికి ఏమాత్రం వెనకాడరని క‌త్రిన‌ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే గారాల కుమారునితో కలిసి పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తుందని ఆశిద్దాం!