ఆత్మగౌరవమే ముఖ్యం.. సమాజానికి గొప్ప సందేశం..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రసవానంతర శారీరక మార్పులపై సోషల్ మీడియాలో కొందరు పనికిరాని ట్రోల్స్ చేస్తుండగా, తాజాగా ఆమె వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
By: Madhu Reddy | 9 Oct 2026 12:41 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రసవానంతర శారీరక మార్పులపై సోషల్ మీడియాలో కొందరు పనికిరాని ట్రోల్స్ చేస్తుండగా, తాజాగా ఆమె వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. లండన్‌లో జరిగిన ‘కే బ్యూటీ’ ఈవెంట్‌లో బాడీ షేమింగ్ కామెంట్లపై ఆమె తొలిసారి నోరు విప్పారు. అసలు ఆమె ఏమన్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆత్మగౌరవమే అందరికీ ముఖ్యం:
ఈవెంట్‌లో భాగంగా సోషల్ మీడియా విమర్శలపై కత్రినా స్పందిస్తూ చాలా స్పష్టమైన మాటలు చెప్పారు. "సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన కామెంట్లు మన జీవితాన్ని, మన నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు.. ఒకవేళ ఆ నెగెటివ్ మాటలనే నేను పట్టుకుని కూర్చుంటే, భయంతో అక్కడే ఆగిపోయేదాన్ని. ప్రతి ఒక్కరూ తమకు తాముగా సొంత శ్రేయోభిలాషిగా మారడం చాలా ముఖ్యం" అని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు.
ప్రసవం తర్వాత మారడం సహజమే:
గత ఏడాది నవంబర్‌లో కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ దంపతులు తమ కుమారుడు విహాన్‌కు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఇటీవల అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆమెపై కొందరు బరువు పెరిగారంటూ దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. పిల్లలు పుట్టాక తల్లి శరీరం మారడం అత్యంత సహజమైన ప్రక్రియ అని, తన దృష్టిలో అందంగా ఉండటం అంటే కేవలం సన్నగా కనిపించడం కాదని, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటమే అని తెలిపారు.
వయసుతో పాటు వచ్చే పరిణతి:
ఇండస్ట్రీలో వయసు మరియు అందం గురించి ఉండే అవాస్తవిక అంచనాలను ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. నేను ఎప్పుడూ 21 ఏళ్ల అమ్మాయిలా కనిపించలేను.. అలా కనిపించాలన్న ఆశ కూడా లేదు.కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే పరిణతిని, శారీరక మార్పులను మనం గౌరవించాలి" అంటూ చాలా మెచ్యూర్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఇక ఆమె చెప్పిన ఈ మాటలు ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
సెలబ్రిటీల మద్దతు.. గట్టి కౌంటర్:
కత్రినాను కొందరు బాడీ షేమింగ్ చేసినప్పుడు సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్' వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. అలాగే హృతిక్ రోషన్, పరిణీతి చోప్రా, ఖుష్బూ సుందర్ వంటి ప్రముఖులు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు స్వయంగా కత్రినా రంగంలోకి దిగి, ట్రోలర్స్‌కు తనదైన శైలిలో స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో ఈ ఇష్యూ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
ఇక మొత్తానికి, బాడీ షేమింగ్ లాంటి చీప్ ట్రోల్స్‌కు భయపడకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని కత్రినా కైఫ్ అందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదేదో మాట్లాడతారని కుంగిపోకుండా, మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో ఆమె నిరూపించారు. ఇక ట్రోలర్స్‌కు ఈ అద్భుతమైన సమాధానంతో కత్రినా మరోసారి తన పరిణతిని చాటుకున్నారు.
