అక్టోబర్ 15 - అక్టోబర్ 30 మధ్య కత్రిన ఇంకా ఏం దాస్తోంది?
జాతీయ మీడియాల కథనం ప్రకారం.. కత్రినకు 9వ నెల. వచ్చే నెలలో బిడ్డ పుట్టనుంది. అక్టోబర్ 15 - అక్టోబర్ 30కి మధ్యలో ప్రసవం జరగనుందని వార్తలు వస్తున్నాయి.
By: Sivaji Kontham | 21 Sept 2025 5:00 AM ISTఅక్టోబర్ 15 - అక్టోబర్ 30కి మధ్య కత్రిన జీవితంలో ఏం జరగబోతోంది? ఏదైనా ఊహించనిది జరుగుతోందా! అంటే దానికి సమాధానం ఇక్కడ ఉంది. ఆ రెండు తేదీల మధ్య కత్రిన తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పబోతోంది. అది తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు జనన సమయం. ఆ సమయంలో పండంటి బిడ్డను ప్రసవించి, ఆ బిడ్డను ప్రేమగా ముద్దాడబోతోంది. విక్ కాట్ జీవితంలో అది చాలా ప్రత్యేకమైన క్షణం కాబోతోంది.
ప్రస్తుతానికి విక్కీ కౌశల్- కత్రిన జంట ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ కత్రిన బేబి బంప్ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట అధికారికంగా ఈ వార్తను ప్రకటించకపోయినా కానీ, అభిమానులు ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నారు. కత్రినా కైఫ్ మూడవ త్రైమాసికంలో ఉందని కథనాలొస్తున్నాయి.
జాతీయ మీడియాల కథనం ప్రకారం.. కత్రినకు 9వ నెల. వచ్చే నెలలో బిడ్డ పుట్టనుంది. అక్టోబర్ 15 - అక్టోబర్ 30కి మధ్యలో ప్రసవం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ``ప్రస్తుతానికి కత్రిన భర్త విక్కీ కౌశల్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత దానిని వెల్లడించాలనుకుంటున్నారు`` అని ప్రముఖ మీడియా తన కథనంలో పేర్కొంది.
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ తమ రెండవ గర్భధారణ సమయంలో చేసినట్లుగానే, విక్ కాట్ కూడా వారి బిడ్డను మీడియా గ్లేర్‌కి దూరంగా ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది. తాజాగా లీకైన ఫోటోను బట్టి కత్రినా బేబీ బంప్ ప్రకటన షూట్‌లో కనిపించిందా? అనే సందేహాల్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే బేబి బంప్ తో ప్రకటనలో నటించాలన్నా కత్రినకు బేబి బంప్ ఉంటేనే అది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతుందని కొందరు లాజిక్ ని కూడా వెతుకుతున్నారు.
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ జంట ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. సుమారు రెండేళ్ల పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసిన ఈ జంట డిసెంబర్ 2021లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లో సింపుల్ వెడ్డింగ్ ప్లాన్ చేయగా కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. కత్రిన చివరిగా మెర్రీ క్రిస్మస్ లో నటించింది. టైగర్ 3లో కూడా కనిపించింది. విక్కీ కౌశల్ `చావా` చిత్రంతో అద్భుత విజయం అందుకున్నాడు. తదుపరి భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ లో నటిస్తున్నాడు.
