వెండితెర నుంచి బిజినెస్ క్వీన్‌గా కత్రినా కైఫ్ ఆర్థిక సామ్రాజ్యం!
నటిగా ప్రారంభమైన కత్రినా ప్రయాణం వ్యాపారవేత్తగా భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన మహిళా సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచే స్థాయికి చేరుకున్నారు.
By: Srikanth Kontham | 21 Sept 2026 3:00 PM ISTబాలీవుడ్ లో కత్రినా కైఫ్ కెరీర్ ఎంత వైభవంగా సాగిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. వివాహం తర్వాత సెలక్టివ్ గా ఉండటం...అటుపై మామ్ కావడంతో సినిమాల వేగం తగ్గింది మనిహా కత్రినా నాకి రాని అవకాశాలంటూ లేవు. సెకెండ్ ఇన్నింగ్స్ ను మాత్రం మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది. వీలైనంత వరకూ నటనలకు ఆస్కారం ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను అలరించాలంటున్నారు. మరి ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కత్రినా ఆస్తుల విలువ ఎంత ? అంటే నివేదికల ప్రకారం ప్రస్తుతం కత్రినా నికర ఆస్తుల విలువ 224 కోట్ల నుంచి 263 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. నటిగా ప్రారంభమైన కత్రినా ప్రయాణం వ్యాపారవేత్తగా భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన మహిళా సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచే స్థాయికి చేరుకున్నారు.
కత్రినా ప్రధాన ఆదాయ వనరుల్లో సినిమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. 2003లో `బూమ్` చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమ్మడు అటుపై `నమస్తే లండన్`, `వెల్కమ్`, `సింగ్ ఈజ్ కింగ్`, `టైగర్` ఫ్రాంచైజీ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఆరకంగా భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ పొందే కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
క్యాట్ ఇమేజ్ సినిమాలకే పరిమితం కాలేదు. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ద్వారా కూడా కత్రినా భారీగా అర్జిస్తున్నారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్లలో క్యాట్ ఒకరు. స్లైస్, లొరియల్, రీబాక్, యూనిక్లో వంటి అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కత్రినా ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రకటనల ప్రపంచంలో ఆమెకున్న నమ్మకం, క్రేజ్ క్యాట్ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి.
కత్రినా ఆర్థిక సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన ఘట్టం `కే బ్యూటీ` ప్రారంభం. 2019లో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం నైకాతో కలిసి సొంతంగా స్థాపించిన కాస్మెటిక్ బ్రాండ్, స్వల్ప కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. భారతీయ చర్మ తత్వానికి తగ్గట్టుగా నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో కే బ్యూటీ వందల కోట్ల టర్నోవర్ సాధిస్తూ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఈ వ్యాపార విజయం కత్రినాను నటిగానే కాకుండా ఒక నైపుణ్యం కలిగిన బిజినెస్ ఉమెన్‌గా నిలబెట్టింది.
వ్యాపారాలు, సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ , ఇతర పెట్టుబడులలోనూ కత్రినా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ముంబైలోని బాంద్రా జుహు ప్రాంతాల్లో కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్లు, పెెంట్‌హౌస్‌లు ఉన్నాయి. లండన్‌లోనూ కు సొంత ఇల్లు ఉంది. వీటితో పాటు నైకాతో పాటు పలు సక్సెస్ ఫుల్ కంపెనీలలో తొలిదశలోనే చేసిన వ్యూహాత్మక పెట్టుబడులు కత్రినాకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి.
స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి వచ్చి సరైన ప్రణాళికలు, కష్టపడే తత్వంతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కత్రినా కైఫ్ ప్రయాణం స్పూర్తిదాయకం. నటనలో మెప్పిస్తూనే సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ ఐకాన్‌గా స్థానాన్ని పదిలం చేసుకున్న కత్రినా రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరిన్ని శిఖరాలను అధిరోహించడం ఖాయం.
