పది నెలలు అయినా ఆమెపై ఆగని ట్రోల్స్
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ తీవ్రమైన బాడీ షేమింగ్ ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఆమెను సోషల్ మీడియాలో హద్దులు మీరి మరీ ట్రోల్స్ చేస్తున్నారు.
By: Ramesh Palla | 18 Sept 2026 12:27 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోరు. ప్రతి సెలబ్రిటీ ఏదో ఒక సమయంలో నెగటివ్ ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సిందే. అయితే కొందరు ఆ ట్రోలింగ్‌ను తేలికగా కొట్టిపారేస్తే, కొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. కొందరు సెలబ్రిటీలు ఏకంగా బాడీ షేమింగ్ ట్రోల్స్ ను సైతం ఎదుర్కొంటున్నారు. ఇతర విషయాల కంటే బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎక్కువగా మనసుకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆ విషయం చాలా మంది సెలబ్రిటీలు అనుభవించి ఉన్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ బాడీ షేమింగ్‌కు గురి అయ్యి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ తీవ్రమైన బాడీ షేమింగ్ ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఆమెను సోషల్ మీడియాలో హద్దులు మీరి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. గత పది నెలలుగా ఆమె ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
విక్కీ కౌశల్, కత్రీనా దంపతులకు బాబు...
విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న కత్రీనా కైఫ్ గత ఏడాది అబ్బాయికి జన్మనిచ్చిన విషయం తెల్సిందే. సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఫిజిక్ పరంగా పెరగడం మనం చూస్తూ ఉంటాం. సాధారణ సమయంలో వెయిట్ కంటే కనీసం 10 నుంచి 20 శాతం వెయిట్ పెరగడం సహజం. అయితే డెలివరీ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో నార్మల్‌గా మారుతారు. కానీ కొందరు వారి శరీర తీరు కారణంగా కాస్త ఎక్కువ సమయం బరువు తగ్గడానికి తీసుకుంటారు. కత్రీనా కైఫ్ గత ఏడాది నవంబర్ లో కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె శరీర ఆకృతి గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవల వినాయక ఉత్సవంలో పాల్గొన్న సమయంలో కత్రీనా మీడియా కంట పడింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
కత్రీనా కొత్త ఫోటోలు వైరల్...
కత్రీనా కైఫ్ కొత్త ఫోటోలు చూసిన వారు చాలా మంది తీవ్రమైన పదజాలంతో ట్రోల్స్ చేస్తున్నారు. కొందరు ఏకంగా కత్రీనాను విక్కీ కౌశల్‌కి తల్లిగా ఉన్నావు అంటున్నారు. ఫేస్‌లో ఇంతకు ముందు ఉన్న గ్లో, ఆ ఛార్మింగ్ ఇప్పుడు లేదు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్రీనా పూర్తిగా ముసలి మొహం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కత్రీనాను గత పది నెలలుగా తీవ్రమైన పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. అది ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. నిజంగానే కత్రీనా ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ అందరిలోకి అందగత్తె అనడంలో సందేహం లేదు. అయితే పరిస్థితుల ప్రభావం, ఆమె గర్భం దాల్చడం ఇతర విషయాల కారణంగా శరీర ఆకృతిలో మార్పు వచ్చింది. అంత మాత్రానికి ఆమెను తీవ్రమైన పదజాలంతో ట్రోల్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
సోషల్ మీడియా ట్రోల్స్‌తో...
సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి భయపడి గత కొన్నాళ్లుగా కత్రీనా ఎక్కువగా ఫోటో షూట్స్ ను ఇన్‌స్టాలో షేర్ చేయడం లేదు. అడపా దడపా ఫోటోలు షేర్ చేసినా, ఏవైనా ఈవెంట్స్ కు హాజరు అయినా ఇలా ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కత్రీనా బరువు తగ్గక పోవడం వెనుక కారణాలు ఏంటో అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా నటించి సన్నగా నాజూకుగా అందంగా కనిపించిన కత్రీనాను ఇప్పుడు ఇలా చూడటం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ ఆమె తల్లి కావడం వల్ల ఇలా మారిందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని కొందరు ట్రోలర్స్‌ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కత్రీనా ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ట్రోల్స్ ను ఆమె గతంలోనూ చాలా చూసింది. అయితే ఈసారి పరిమితి దాటినా కూడా ఆమె ఓపిక పడుతూ వస్తుంది. ముందు ముందు ఆమె ట్రోల్స్ కు సమాధానం చెప్పే విధంగా సన్నగా, మునుపటి మాదిరిగా నాజూకుగా మారుతుందేమో చూడాలి. మాటలతో కాకుండా తన చేతలతో కత్రీనా సమాధానం చెప్పాలని ప్యాన్స్ కోరుకుంటున్నారు.
