400 కోట్ల సృష్టికర్తను ఇలా ట్రోల్ చేస్తారా? కత్రినకు పాకిస్తానీ నటి మద్ధతు!
ఈ వివాదం కేవలం భారత్‌కే పరిమితం కాకుండా పాకిస్తాన్ వరకు పాకడం గమనార్హం. పాకిస్తానీ కామెంట్లు చేసే డాక్టర్ ఏజాజ్ వారిస్.. కత్రినా రూపంపై విమర్శిస్తూ కించపరిచేలా మాట్లాడారు.
By: Srikanth Kontham | 19 Sept 2026 9:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇటీవల అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరయ్యారు. గత నెలలో ఈ నటి పండంటి మగబిడ్డకు (విహాన్ కౌశల్) జన్మనిచ్చిన తర్వాత చాలా తక్కువగా పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కనిపించిన తీరుపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు (ముఖ్యంగా పురుషులు) బాడీ షేమింగ్‌కు పాల్పడుతూ.. కత్రిన పెరిగిన బరువు- రూపంపై నెగెటివ్ కామెంట్లు చేశారు.
ఈ ట్రోలింగ్‌పై నటి ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. మహిళల వయస్సును, శరీరాన్ని ఎందుకు పబ్లిక్ డిబేట్ అంశంగా మారుస్తారని సీనియర్ నటీమణి నిలదీశారు. ఒక మగాడికి బట్టతల వస్తే `డిస్టింగిష్డ్` అంటారని... అదే మహిళల విషయంలో మాత్రం ప్రతి ముడతను.. పెరిగిన ప్రతి కిలో బరువును తప్పుబడుతూ డబుల్ స్టాండర్డ్స్ ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ప్రసవం, మాతృత్వం అనేది ఒక మహిళకు పునర్జన్మ లాంటిదని... ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు.
ఈ వివాదం కేవలం భారత్‌కే పరిమితం కాకుండా పాకిస్తాన్ వరకు పాకడం గమనార్హం. పాకిస్తానీ కామెంట్లు చేసే డాక్టర్ ఏజాజ్ వారిస్.. కత్రినా రూపంపై విమర్శిస్తూ కించపరిచేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పాక్ నటి హానియా ఆమిర్ స్పందిస్తూ.. మహిళల శరీరాలు, వయసును వినోదం కోసం, వ్యూస్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని... మహిళలు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ నోట్ షేర్ చేశారు.
మరో పాక్ నటి ఐదా షేక్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. `ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్` పేరిట సైబర్ హరాస్‌మెంట్‌ను, బాడీ షేమింగ్‌ను ఎప్పుడు నార్మలైజ్ చేశామని ఆవేదన చెందారు. రూ. 20 వేలు సంపాదించేవాళ్ళు రూ. 400 కోట్ల విలువైన విజయవంతమైన మహిళలను విమర్శించడం హాస్యాస్పదమని.. ట్రోలర్లు ముందు తమను తాము అద్దంలో చూసుకోవాలని హితవు పలికారు.
కత్రినాతో కలిసి గతంలో నటించిన సింగర్-నటుడు అలీ జాఫర్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. తోటి మనుషులపై విమర్శలు గుప్పించే ముందు ప్రతి ఒక్కరూ సమాజం సృష్టించిన అవాస్తవిక సౌందర్య ప్రమాణాలను సరిదిద్దుకోవాలని సూచించారు. మాతృత్వం అనేది ఒక మహిళ జీవితంలో అందమైన దశ అని.. బాడీ షేమింగ్‌కు పాల్పడే ట్రోలర్ల నుంచి కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఆసక్తికరంగా కత్రిన కైఫ్ అంచెలంచెలుగా ఎదిగి 400 కోట్ల నెట్ వర్త్‌తో అగ్ర నాయికలలో ఒకరిగా కొనసాగుతున్నారు. జీరో నుంచి హీరోగా ఎదిగిన ఈ నటి దశాబ్ధాల కెరీర్ తర్వాత పెళ్లి చేసుకుని బిడ్డను కని భర్త బిడ్డతో హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తుంటే.. ఇప్పుడిలాంటి ట్రోలింగ్ అసందర్భంగా కనిపిస్తోంది.
