Begin typing your search above and press return to search.

కత్రినా బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్.. ఎంత క్యూట్ గా ఉందో!

ఇండస్ట్రీలో ఉండే ఒక జంట వివాహం చేసుకుంది అంటే.. ఎప్పుడు శుభవార్త చెబుతుంది అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తారు.

By:  Madhu Reddy   |   20 Sept 2025 6:00 PM IST
కత్రినా బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్.. ఎంత క్యూట్ గా ఉందో!
X

ఇండస్ట్రీలో ఉండే ఒక జంట వివాహం చేసుకుంది అంటే.. ఎప్పుడు శుభవార్త చెబుతుంది అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. అయితే అందులో కొంతమంది పెళ్లయిన ఏడాది లేదా రెండు సంవత్సరాలలోపే పిల్లలను ప్లాన్ చేసుకుంటే.. మరి కొంతమంది ఏళ్లు గడిచినా కూడా ఇంకా పిల్లల గురించి ఆలోచించరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇదివరకే దీపికా పదుకొనే, రామ్ చరణ్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లయిన కొన్నేళ్లకు తల్లిదండ్రులై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు వీరి దారిలోనే కత్రినా కైఫ్ కూడా నడుస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా వయసులో తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది కత్రినా కైఫ్. పెళ్లయి నాలుగేళ్లయినా ఇంకా పిల్లలు కనక పోవడంపై అభిమానులు నిరుత్సాహ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గత కొన్ని రోజులుగా కత్రినా కైఫ్ కొత్త సినిమా ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో ప్రెగ్నెంట్ అయిందని.. ఈ ఏడాది చివర్లో తల్లిదండ్రులు కాబోతున్నారని.. అందుకే ఆమె కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేకపోయేసరికి అభిమానులు మాత్రం ఇది నిజం కావాలని ఎన్నో కలలు కన్నారు..

అయితే అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కత్రినా కైఫ్ మెరూన్ రెడ్ గౌనులో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపించింది. అంతేకాదు ఆమె బేబీ బంప్ ను కూడా చూపించింది. ఇది చూసిన నెటిజన్స్ మెటర్నిటీ ఫోటోషూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే మెటర్నిటీ ఫోటోషూటా.. లేక షూటింగ్లో భాగమా అనే విషయంపై స్పష్టత లేదు. పైగా ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే చాలా క్యూట్గా బేబీ బంప్ లో కత్రినా కైఫ్ కనిపించేసరికి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. అంతేకాదు ఈ జంటకు అభినందనలు కూడా తెలియజేస్తూ పోస్ట్ పెడుతూ ఉండడం గమనార్హం.

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లి విషయానికి వస్తే.. వీళ్లిద్దరూ మొదటిసారి 2019లో కలుసుకున్నారు. అలా కలయిక కాస్త స్నేహంగా మారి.. కాలక్రమేనా ఒక్కటయ్యారు. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో ఘనంగా వివాహం చేసుకున్నారు. విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. ఛావా అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించార. ఇప్పుడు రణబీర్ కపూర్ ఆలియా భట్ తో కలిసి లవ్ అండ్ వార్ అనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. కత్రినా కైఫ్ మాత్రం చివరిసారిగా మేరీ క్రిస్మస్ అనే సినిమాలో కనిపించింది.