అన్నిటిని మించినది నిజమైన తల్లి ప్రేమ.. ఇదిగో ఇదే ప్రూఫ్
బాలీవుడ్ సూపర్ స్టార్ కత్రినా కైఫ్ ఇటీవల కొంతకాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 19 July 2026 9:00 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ కత్రినా కైఫ్ ఇటీవల కొంతకాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. విక్కీని పెళ్లాడి మామ్ అయ్యాక పూర్తిగా వ్యక్తిగత-కుటుంబ జీవితానికే క్యాట్ అంకితమైంది. అయితే సోషల్ మీడియాల్లో మాత్రం నిరంతరం తన అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. తన వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయాన్ని ఇన్ స్టాగ్రమ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలలో కత్రిన షేర్ చేస్తూనే ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన 43వ బర్త్ డే ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు అందుకున్న ఈ నటి.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన, అందమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాదిగా అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వైరల్ పోస్ట్‌లో అందరినీ ఆకట్టుకున్న కీలక విషయం ఏమిటంటే.. కత్రిన తన ఎదుగుతున్న కుమారుడి ఫోటోలను షేర్ చేయడం ద్వారా తన ఆనందాన్ని బహిర్గతం చేసింది. 2025లో కత్రిన- విక్కీ జంటకు జన్మించిన బిడ్డకు విహాన్ అని నామకరణం చేసారు. గత కొన్ని నెలలుగా తన విహాన్ ని చాలా రహస్యంగా ఉంచిన కత్రినా... ఈ పోస్ట్‌తో తన అభిమానులకు చిన్నారి బాలుడి ఫోటోను పాక్షికంగా అందించింది. అభిమానులు దీనిని కత్రినా లైఫ్‌లో `మదర్ ఎరా` (తల్లిగా కొత్త ప్రయాణం) అని పిలుస్తూ.. ఈ కొత్త ఫ్యామిలీ మూమెంట్స్‌ను చూసి మురిసిపోతున్నారు.
ఆ బాబు పేరు `విహాన్` అని అభిమానులు ఫోటోలు చూసి ఉత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు. తన భర్త విక్కీ కౌశల్‌తో కత్రినా ఆనందమయ జీవితం గురించి చెప్పాల్సిన పని లేదు. కత్రినా పాత యాడ్స్‌ను గుర్తుచేసేలా ఉన్న మొదటి ఫోటో నుండి... ఎమోషనల్ గా ఉన్న చివరి ఫోటోల వరకు.. ప్రతి ఒక్కటి ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ పిక్చర్‌ను కళ్ళకు కట్టాయి.
ఈ పోస్ట్ కింద బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు క్యూ కట్టడంతో కామెంట్ సెక్షన్ అంతా ప్రత్యేకంగా మారిపోయింది. కత్రినా ఆత్మీయులు, పరిశ్రమ స్నేహితులైన జోయా అఖ్తర్, దియా మీర్జా, వాణీ కపూర్, అదితి రావు హైదరి, ఇషాన్ ఖట్టర్ వంటి తారలు ఈ జంటపై హార్ట్ ఎమోజీలు, ఆశీర్వాదాలతో ప్రేమను కురిపించారు. ఇండస్ట్రీ నుండి లభించిన ఈ అపారమైన మద్దతు, కత్రినా తన తోటి నటీనటుల్లో ఎంతటి ఆదరణ కలిగి ఉందో మరోసారి నిరూపించింది.
అయితే ఈ వేడుకల మధ్య కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఒకవైపు శుభాకాంక్షల వరద పోటెత్తగా.. మరోవైపు కొందరు నెటిజన్లు కత్రినా తన సోషల్ మీడియాను దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించడానికి ఉపయోగించాలని కోరారు. ముఖ్యంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు ఇవ్వాలని కొందరు కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ చిన్నపాటి విమర్శల కంటే కూడా ఆరాధ్య నటి కత్రినపై కురిసిన ప్రేమ, వారసుడు విహాన్ కి అందించిన దీవెనలే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
