Begin typing your search above and press return to search.

'టైటానిక్‌' ముద్దు సీన్స్‌ మళ్లీ...!

1997లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ 'టైటానిక్‌' గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నామంటే ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Ramesh Palla   |   31 Aug 2026 10:00 PM IST
టైటానిక్‌ ముద్దు సీన్స్‌ మళ్లీ...!
X

1997లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ 'టైటానిక్‌' గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నామంటే ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్‌ వారికి టైటానిక్ గురించి, ఆ సినిమా సాధించిన విజయం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1980 కిడ్స్ కి టైటానిక్‌ మూవీ ఒక ఎమోషన్ అంటారు. ఒక గొప్ప ప్రేమ కావ్యం అని ఎంతో మంది అప్పట్లో మాట్లాడుతూ ఉండేవారు. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిన టైటానిక్ మూవీని ఇప్పుడు రీ రిలీజ్‌ చేసినా వేల కోట్ల వసూళ్లు ఇచ్చేందుకు 80 కిడ్స్ రెడీగా ఉన్నారంటూ ఒక సర్వేలో వెల్లడి అయింది. టైటానిక్ వచ్చి మూడు దశాబ్దాలు అయినా ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం, ఆ సినిమా గురించిన విషయాలు, లవ్‌ సీన్స్‌, లిప్‌ లాక్‌ సీన్స్ అన్నింటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు.

హాలీవుడ్‌ రొమాంటిక్ మూవీ టైటానిక్‌...

ఆ సమయంలో హాలీవుడ్‌ సినిమాల్లోనూ అంతంత మాత్రంగా రొమాంటిక్‌ సీన్స్‌ ఉండేవి, ముద్దు సీన్స్ ఉన్నప్పటికీ ఒక స్థాయి వరకు ఉండేవి, కానీ టైటానిక్ మూవీలో హద్దులు దాటారు, ముద్దుల విషయంలో కొత్తగా షూట్‌ చేశారు. మొత్తానికి టైటానిక్ ముద్దు సీన్స్‌, రొమాంటిక్‌ సీన్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. ఆ సీన్స్‌లో నటించిన కేట్‌ విన్స్‌లెట్‌, లియోనార్డోల గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉండేవి. తాజాగా మరోసారి కేట్‌ విన్స్‌లెట్‌ ఒక ఇంటర్వ్యూలో టైటానిక్ ముద్దుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఒక ఇంటర్నేషనల్‌ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేట్‌ విన్స్‌లెట్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముప్పై ఏళ్లనాటి విషయాలను మరోసారి ఆమె నెమరేసుకుంటూ సినిమా విషయాలను గురించి చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

కేట్‌ ఇంటర్వ్యూలో ముద్దు సీన్‌ ముచ్చట్లు...

కేట్‌ ను ఇంటర్వ్యూ చేసిన హోస్ట్‌ లిప్‌ లాక్‌ సీన్స్ గురించి పదే పదే గుచ్చి గుచ్చి అడగడంతో ఆమె ఓపెన్‌ అయింది. లియోనార్డో మంచి కిస్సరా అంటూ హోస్ట్‌ ప్రశ్నించడంతో కేట్‌ మొహమాటం లేకుండా ఔను అతడు బెస్ట్‌ కిస్సర్‌ అంటూ సమాధానం ఇచ్చింది. టైటానిక్ సినిమా సమయంలో తమ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. ముద్దు సన్నివేశంలోనూ మేము ఇబ్బంది పడలేదు. అది సాదారణ షూటింగ్‌గానే భావించి చేసేవాళ్లం. ముద్దు సీన్‌ సమయంలో మీ నాలుకను లియోనార్డో నోట్లో పెట్టారా అంటూ హోస్ట్‌ ప్రశ్నించిన సమయంలో లేదు అని కేట్‌ సమాధానం ఇచ్చింది. అయితే కేట్‌ నాలుక మాత్రం తన నోట్లో పెట్టినట్లుగా చెప్పింది. అది అంతా కూడా షూటింగ్‌లో భాగం అని మరోసారి కేట్‌ చెప్పుకొచ్చింది.

లియోనార్డో పై కేట్‌ క్రష్‌...

లియోనార్డో పై క్రష్ ఏర్పడిందా అంటూ కేట్‌ ను ప్రశ్నించిన సమయంలో.. కేట్‌ స్పందిస్తూ షూటింగ్‌ సమయంలో లియోనార్డో తో క్రష్‌ కలుగుతుందని అనుకున్నాను. కానీ ఆయన ప్రవర్తన ఎప్పుడూ డీసెంట్‌గానే ఉండేది. షూటింగ్‌ గ్యాప్‌ లో సరదాగా ఆట పట్టిస్తూ మంచి స్నేహితుడిగా ఉండేవాడు. టైటానిక్ షూటింగ్‌ ఏడు నెలలు సాగింది. ఆ ఏడు నెలల్లో ప్రతి రోజు 20 గంటలు మేము కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉండేవాళ్లం. అందుకే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఆయన నాకు మంచి స్నేహితుడు తప్ప అంతకు మించి ఏం లేదు. మా స్నేహం స్వచ్చమైనది అన్నట్లుగా కేట్‌ చెప్పుకొచ్చింది. ముద్దు సీన్‌ గురించి కేట్‌ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడటంతో మరోసారి టైటానిక్‌ వైరల్‌ అవుతోంది. అంతే కాకుండా టైటానిక్‌ రీ రిలీజ్ చేయాలంటూ డిమాండ్‌ పెరుగుతోంది.