Begin typing your search above and press return to search.

టైటానిక్ హీరోయిన్ ఎలా ఉందొ చూసారా..ఇక డైరెక్ట‌ర్ గా

కేట్ విన్స్‌లెట్.. కొన్ని ద‌శాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో న‌టించి త‌న టాలెంట్ తో ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంటూ వ‌చ్చిన ఈ టైటానిక్ భామ ఇప్పుడు డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Nov 2025 6:26 PM IST
టైటానిక్ హీరోయిన్ ఎలా ఉందొ చూసారా..ఇక డైరెక్ట‌ర్ గా
X

కేట్ విన్స్‌లెట్.. కొన్ని ద‌శాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో న‌టించి త‌న టాలెంట్ తో ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంటూ వ‌చ్చిన ఈ టైటానిక్ భామ ఇప్పుడు డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ డ్రామా గుడ్ బై జూన్ తో విన్స్‌లెట్ డైరెక్ట‌ర్ గా మార‌బోతున్నారు. విన్స్‌లెట్ కొడుకు జో ఆండ‌ర్స్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా గుడ్ బై జూన్ రూపొందించ‌గా, ఇందులో టోనీ కొల్లెట్, జానీ ఫ్లిన్, ఆండ్రియా రైస్‌బ‌రో, తిమోతి స్పాల్, హెలెన్ మిర్రెన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

గుడ్‌బై జూన్ పై మంచి అంచ‌నాలు

ఎంతోమంది స్ట్రాంగ్ బ్రిటీష్ క్యాస్ట్ భాగ‌మైన గుడ్ బై జూన్ పై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. క్యాస్టింగ్ తోనే దీనిపై హైప్ ను పెంచిన విన్స్‌లెట్ గుడ్ బై జూన్ తో డైరెక్ట‌ర్ గా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. పైగా అన్నీ చూసుకునే విన్స్‌లెట్ డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేస్తున్నారు. రీసెంట్ గా లీ సినిమాలో త‌న న‌ట‌న‌కు గానూ విన్స్‌లెట్ కు గోల్డెన్ గ్లోబ్ మ‌రియు BAFTA నామినేష‌న్ల‌లో గెలిచారు.

ఈ విష‌యాలు కూడా విన్స్‌లెట్ డైరెక్ష‌న్ లోకి అడుగుపెడుతున్న స‌మయంలో త‌న స్థానాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్నాయి. అయితే కొంద‌రు మాత్రం విన్స్‌లెట్ డైరెక్ట‌ర్ గా మార‌డాన్ని త‌న కెరీర్లో నెక్ట్స్ ఫేజ్ అని చెప్తూ, గ‌తంలో ఆమె చేసి ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్లను దృష్టిలో పెట్టుకుని గుడ్ బై జూన్ గొప్ప‌గానే ఉంటుంద‌ని భావిస్తున్నారు. కుటుంబ అంత‌రాయాల‌ను ఎదుర్కొంటున్న తోబుట్టువుల క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ డ్రామా ఎమోష‌న‌ల్ వెయిట్ ను బ్యాలెన్స్ చేయడ‌మే టార్గెట్ గా పెట్టుకుంది.

విన్స్‌లెట్ పేరు, నిజాయితీ గుడ్ బై జూన్ స్థాయిని పెంచ‌డంతో పాటూ అందులోని వెట‌రన్ క్యాస్టింగ్ కూడా ఈ డ్రామాపై అంచ‌నాల‌ను పెంచుతుంది. అన్నీ సానుకూలంగా జ‌రిగి గుడ్ బై జూన్ సినిమాకు మంచి రివ్యూలు వ‌స్తే, విన్స్‌లెట్ నుంచి ఫ్యూచ‌ర్ లో కూడా ఫిల్మ్ మేక‌ర్ గా మ‌రిన్ని సినిమాలొచ్చే ఛాన్సుంది. మ‌రి ఆడియ‌న్స్ గుడ్ బై జూన్ ను ఏ యాంగిల్ లో చూస్తారో చూడాలి.