Begin typing your search above and press return to search.

విజయ్ పాలనపై కస్తూరి కామెంట్స్.. వీడియో వైరల్!

ఇకపోతే ఇదే సమయంలో కస్తూరి మిగిలిన రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు చర్చకు దారి తీస్తున్నాయి.

By:  Madhu Reddy   |   4 Sept 2026 2:26 PM IST
విజయ్ పాలనపై కస్తూరి కామెంట్స్.. వీడియో వైరల్!
X

అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కస్తూరి శంకర్.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలు, సీరియల్స్ లో అద్భుతంగా నటిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఇటు సామాజిక అంశాలపై స్పందిస్తూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే తాజాగా నటిస్తూ థియేటర్లలో విడుదలైన చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. సాయికుమార్, రాజీవ్ కనకాల, సుమన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది.

మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి శంకర్.. సినిమా కథలపై, ప్రేక్షకుడి విజన్ పై అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ పరిపాలనపై కూడా కామెంట్లు చేసింది.. కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." తమిళనాడులో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎలక్షన్స్ అంటే ఎంతో డబ్బు వెచ్చించాల్సి ఉండేది.. డబ్బులు, మద్యం, బిర్యానీ అంటూ కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. అక్కడితో ఆగకుండా డాన్సులు, పాటలు ఆ తమాషాలతో ఒకప్పుడు పోటీ జరిగేది. కానీ ఇప్పుడు అదంతా పోయి.. ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చారు.. ఎలక్షన్లో గెలిచేసారు. మెజారిటీ అనేది పక్కన పెడితే.. ఒక కొత్త ఆలోచన వచ్చింది. దారి ఏర్పడింది. తమిళనాడులో మార్పు వచ్చింది అనేది మాత్రం నిజమే.

డబ్బులు ఇవ్వలేదు.. గెలిచేసారు. గెలిచి వచ్చాక ఏం చెబుతున్నారు మీరు డబ్బులు ఇవ్వకండి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఎక్కడైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి అంటూ ప్రజలకు చెబుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా మనం చూస్తున్నాం. నిజానికి డబ్బులు ఇవ్వకుండా పనిచేయమంటే ఎవరూ పని చేయరు. కానీ ఇప్పుడు ఆ మార్పు కొంచెం కొంచెం గా వస్తోంది. ముఖ్యంగా టాప్ లో ఉన్నవాళ్లు నేను చెబుతున్నాను.. నా మీద ఒట్టు.. మీరు డబ్బులు ఇవ్వకండి అని చెప్పడమే ఒక పెద్ద మార్పు. ఇప్పటివరకు వచ్చిన నాయకులు ఎవరూ కూడా నాకు డబ్బు ఇవ్వకండి.. లంచం ఇవ్వకండి అని చెప్పలేదు. కానీ తమిళనాడులో ఈ మార్పు వచ్చింది. దీనిని మనం ఒక విప్లవంగా చూస్తున్నాం. అంటూ తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వస్తున్న మార్పులపై ఆమె ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే ఇదే సమయంలో కస్తూరి మిగిలిన రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వకండి ..లంచం ఇవ్వకండి.. పనిచేస్తామని చెప్పిన దాఖలాలు లేవు అని చెప్పిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.. అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక లంచగొండి అని మీ అభిప్రాయమా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది ఏ చర్చకు దారి తీస్తుందో తెలియాలి.