హీరోలు స్మగ్లర్స్ అయితేనే ఆడియన్స్ మూవీ చూస్తారా.. కస్తూరి ఊహించని కామెంట్స్!
విషయంలోకి వెళ్తే.. డ్రగ్స్ మాఫియా, విద్యార్థుల ఆక్రోషం, ఒక సామాన్యుడి పొలిటికల్ పోరాటం లాంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'.
By: Madhu Reddy | 4 Sept 2026 10:53 AM ISTప్రముఖ సినీ నటి కస్తూరి శంకర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1992లో తొలిసారి 'గ్యాంగ్ వార్' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. 1997లో వచ్చిన 'అన్నమయ్య' సినిమాలో అక్కలమ్మ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కన్నడ, తమిళ్, మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా పలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన కస్తూరి శంకర్ ఎక్కువగా సీరియల్స్ లో నటిస్తూ మరింత పేరు దక్కించుకుంది.'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. అంతేకాదు బిగ్ బాస్ 2 తమిళ్ లో కూడా పెర్ఫార్మెన్స్ చేసిన ఈమె.. 2019లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరోసారి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 లో కూడా పాటిస్పేట్ చేసింది.
సినిమాలు, షో లు, సీరియల్స్ మాత్రమే కాకుండా పొలిటికల్ పరంగా కూడా బిజీగా ఉన్న కస్తూరి శంకర్.. సామాజిక అంశాలపై బహిరంగ కార్యక్రమాలలో కామెంట్లు చేస్తూ.. అలా చేసే వ్యాఖ్యలు ఈమెను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. తమిళుల గురించి, తెలుగు బ్రాహ్మణుల గురించి గతంలో చేసిన కామెంట్లకు జైలు జీవితం కూడా గడిపింది. అలాంటి ఈమె తాజాగా ఈ మధ్యకాలంలో హీరోలు స్మగ్లింగ్, క్రిమినల్స్ లాంటి పాత్రలో నటిస్తున్నారని, అలా అయితేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే విధంగా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
విషయంలోకి వెళ్తే.. డ్రగ్స్ మాఫియా, విద్యార్థుల ఆక్రోషం, ఒక సామాన్యుడి పొలిటికల్ పోరాటం లాంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'. సీనియర్ నటులు సుమన్ , సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించగా.. కస్తూరి ,రాజీవ్ కనకాల, శివకుమార్, వితికా షేరు, నటరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 4న వచ్చింది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం. పోతే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. మాయాబజార్, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసి పెరిగాను. తెలుగు సినిమాలలో హీరో అంటే ఆ కాలంలో దేవుడు. దేవుడు వస్తాడు.. దేవుడు అవతారాలు కనిపించేవి. ఆ తర్వాత కాలంలో వచ్చిన సినిమాలలో హీరోలు ఎక్కువగా పోలీసు, లాయర్, విప్లవాత్మక పాత్రలలో నటించేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చిత్రాలలో హీరోలు ఎక్కువగా స్మగ్లర్, క్రిమినల్, గ్యాంగ్ స్టర్ లాంటి పాత్రలలో నటిస్తున్నారు." అంటూ కస్తూరి శంకర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు .
నిజానికి ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తున్నప్పుడు దర్శకుడు కూడా కాలానుకనుంగా కథలు రాసుకోవాల్సి ఉంటుంది. అలా ఒకప్పుడు హీరోలను దేవుళ్ళ పాత్రలలో చూపించిన దర్శకులు.. ఇప్పుడు అదే దర్శకుడు ప్రేక్షకుడి ఇష్టాలను, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పాత్రలు రాస్తున్నారు. అయితే కంటెంట్ డెప్త్ గా ఉంటే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఇలాంటి పాత్రలనే ప్రేక్షకుడు ఆదరిస్తారా? మరోవైపు కల్కి , రామాయణం లాంటి చిత్రాలు కూడా వస్తున్నాయి. అందులో హీరోలు దేవుళ్ళ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాబట్టి ఈ కాలంలో హీరోలందరూ అవే పాత్రలు చేస్తున్నారు అనడానికి లేదు. ప్రేక్షకుడి అభిరుచిని బట్టి కథను దర్శకుడు ఎలివేట్ చేసేదాన్ని బట్టి.. ప్రేక్షకుడు ఆదరిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది నెటిజన్స్ హీరోలే కాదు ఒకప్పుడు హీరోయిన్లు కూడా సీతాదేవి లాంటి పాత్రలు చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు వ్యాంప్ పాత్రలు చేస్తున్నారు కదా అంటూ ఈమెకు కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా పాత్ర అనేది ఎప్పుడూ ఒకే తరహా లాగే ఉంటే ప్రేక్షకుడికి బోరు కొడుతుంది. అందుకే పాత్ర ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకోవాలి అంటే అందులో ఎంతో కొంత మార్పులు చేయడం సహజం అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.
