Begin typing your search above and press return to search.

అవకాశం వస్తే ఇప్పటికీ సిద్ధమే!

తన జీవితంలో కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలను అలాగే హీరో నాగార్జునపై తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   31 Oct 2025 6:00 PM IST
అవకాశం వస్తే ఇప్పటికీ సిద్ధమే!
X

ప్రముఖ నటి అందాల తార కస్తూరి శంకర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఒకప్పుడు అన్నమయ్య వంటి ఆధ్యాత్మిక చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ లో నటించి అటు వెండితెరకు ఇటు బుల్లితెరకి కూడా పరిచయమైంది. ఇప్పుడు తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్న ఈమె.. అవకాశం వస్తే ఇప్పటికీ సిద్ధమే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో తన జీవితంలో కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలను అలాగే హీరో నాగార్జునపై తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." నేను చదువుకునే రోజుల్లోనే నాగార్జున పై ఇష్టం పెంచుకున్నాను. ఆ రోజుల్లోనే ఒకసారి కలిశాను కూడా. ముఖ్యంగా ఆరోజు ఆయన వేసుకున్న షర్ట్ దగ్గర నుంచి ఆయన చూసిన చూపు వరకు ప్రతీదీ ఇప్పటికీ గుర్తుంది. ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత.. ఆ టచ్ చేసిన చేయిని నేను రెండు రోజులు కడగలేదు.. ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఇది నాగార్జున టచ్ చేసిన చేయని చాలా గర్వంగా చెప్పుకున్నాను" అంటూ కామెంట్ చేసింది.. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసారా ?అని ప్రశ్నించగా.. చాలా రోజులు అయిపోయింది. ఒకసారి వెళ్లి కలవాలి అనిపిస్తుంది.. కానీ ఏదైనా సాకు దొరకాలి కదా వెళ్లి కలవాలి అంటే అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది.

అదే ఇంటర్వ్యూలో ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు ? అని ప్రశ్నించగా.. మా జనరేషన్లో ఆయన హీరో మాత్రమే కాదు క్రష్ కూడా.. ఇప్పుడు కూడా యువతలో ఆయనకు అదే క్రేజ్ ఉంది. వయస్సు పెరిగినా.. అందం ఏమాత్రం తగ్గలేదు .. అంటూ తెలిపింది. నాగార్జునతో రొమాంటిక్ సీన్ చేయమంటే చేస్తారా? అని ప్రశ్నించగా.. అది బెస్ట్ థింగ్.. అలాంటి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా.. నాగార్జున జెంటిల్మెన్ మాత్రమే కాదు ప్రొఫెషనల్ కూడా.. ఆయనతో నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది. నేను ఎప్పటికీ సిద్ధమే అంటూ సమాధానం ఇచ్చింది కస్తూరి శంకర్. ఇక కస్తూరి శంకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కస్తూరి శంకర్ విషయానికి వస్తే.. మోడల్ గా, కెరియర్ మొదలుపెట్టి టెలివిజన్ వ్యాఖ్యాతగా మారి హీరోయిన్గా తన కెరియర్ను ముందుకు కొనసాగిస్తుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాష చిత్రాలలో నటిస్తున్న ఈమె స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. మద్రాస్ ఉన్నత పాఠశాలలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించిన ఈమె.. 1992లో మిస్ మద్రాస్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. వ్యక్తిగత విషయానికి వస్తే 2000 సంవత్సరంలో డాక్టర్ రవికుమార్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కొడుకు, కుమారుడు ఉండగా.. కుమార్తె ఇటీవల లుకేమియా నుండి బయటపడింది.