'జన నాయగన్' ప్రాపగండ మూవీనా?
ఇదిలా ఉంటే తమిళనటి, పొలిటికల్ లీడర్ కస్తూరి `జన నాయగన్`పై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారాయి.
By: Ravindar Gorantla | 14 April 2026 1:51 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్` వివాదం చిత్ర విచిత్మైన మలుపులు తిరుగుతోంది. సెన్సార్ క్లియరెన్స్ కారణంగా రిలీజ్ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రరాలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ నాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్‌ని సెన్సార్ సిబ్బంది కావాలనే వాయిదా వేసినట్టుగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన కీలక క్లిప్‌లు లీక్‌కు గురై నెట్టింట సర్క్యూలేట్ కావడం తీవ్ర కలలకం రేపుతోంది. ఇప్పటికే దీన్ని మేకర్స్ సీరియస్‌గా తీసుకుని లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు దిగారు. చెన్నైలో ఈ సినిమా క్లిప్‌ల లీక్ వ్యవహారంలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా ఓ లోకల్ ఛానల్‌లో `జన నాయగన్ `క్లిప్‌లు ప్రసారం కావడంతో సదరు లోకల్ ఛానల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే తమిళనటి, పొలిటికల్ లీడర్ కస్తూరి `జన నాయగన్`పై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాని విజయ్ తన పార్టీ ప్రచారం కోసం చేసుకున్నారని, ఇదొక ప్రాపగండ మూవీ అని విమర్శలు చేసింది. అంతే కాకుండా లీక్ అయిన క్లిప్‌లను వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో చూశానని, ఈ క్లిప్‌లని బట్టి చూస్తుంటే సినిమా ఓ ప్రాపగండ మూవీ అని, తన పార్టీని హైలైట్ చేస్తూ బీజేపీపై బురదజల్లే విధంగా సినిమాని రూపొందించారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతే కాకుండా ఈ సినిమా గురించి నేను కొత్త విషయాలు తెలుసుకున్నానని, ప్రజలు ఈ సినిమా చూస్తే విజయ్ టీవీకె పార్టీకి లాభం చేకూరేలా ఉందని, బీజేపీ, డీఎంకెలని విమర్శించినట్టుగా ఉందని పేర్కొంది` దీంతో కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కస్టూరి లీకైన క్లిప్‌లని చూడటంపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయి ఉండి ఇలా పైరసీ క్లిప్‌ని చూడటం ఏంటని కామెంట్‌లు చేస్తున్నారు. దీంతో కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
