Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌గా కార్తికేయ.. బాక్సింగ్ రింగ్‌లో అదిరిపోయే కమ్ బ్యాక్!

తనే స్వయంగా డైరెక్టర్‌గా మారుతూ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  M Prashanth   |   21 Sept 2026 5:39 PM IST
డైరెక్టర్‌గా కార్తికేయ.. బాక్సింగ్ రింగ్‌లో అదిరిపోయే కమ్ బ్యాక్!
X

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ, స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. తనే స్వయంగా డైరెక్టర్‌గా మారుతూ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని తన భార్య లోహిత రెడ్డి నిర్మిస్తుండటం హైలెట్.

సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లు అవుతుంది, తను ప్రొఫెషన్ మారిపోయాడేమో అనుకున్నా అంటూ ఒక వాయిస్ ఓవర్ తో ఈ వీడియో మొదలవుతుంది. ఇన్నాళ్లు ఎక్కడున్నాడో తెలీదు, ఇప్పుడొచ్చి ఏం చేస్తాడు, ఇది ఒక సూసైడ్ మిషన్ లా అనిపిస్తోంది అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ సినిమా స్టోరీ మీద మంచి క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఆ డైలాగ్స్ నడుస్తున్న సమయంలోనే ఒక పాత, చీకటిగా ఉన్న బేస్ మెంట్ లాంటి ప్రదేశంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఉన్న ఒక బాక్సింగ్ రింగ్ దగ్గరకు చేరుకుని స్కిప్పింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రింగ్ లోపల షాడో బాక్సింగ్ చేస్తూ, పక్కనే ఉన్న ఒక పెద్ద పంచింగ్ బ్యాగ్ ను అత్యంత ఆవేశంగా కొడుతూ కార్తికేయ కనిపించిన తీరు చాలా రస్టిక్ గా ఉంది.

ఈ ఇంటెన్స్ బాక్సింగ్ విజువల్స్ తర్వాత స్క్రీన్ మీద 'కమ్ బ్యాక్' అనే పవర్ ఫుల్ టైటిల్ హైలెట్ అయ్యింది. బహుశా తన రియల్ లైఫ్ గ్యాప్ కు, అలాగే సినిమాలో మూడేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన బాక్సర్ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయేలా ఈ టైటిల్ ను చాలా తెలివిగా ఫిక్స్ చేశారు. బాక్సింగ్ గ్లౌవ్స్ వేసుకుని చెమటలు కక్కుతూ సీరియస్ లుక్ లో ఉన్న కార్తికేయ మేకోవర్ ఈ గ్లింప్స్ లో ఆకర్షణగా నిలిచింది.

ఈ వీడియోలో సాంకేతిక నిపుణుల పనితీరు కూడా చాలా డీసెంట్ గా అనిపించింది. జగదీశ్ కెమెరా వర్క్ ఆ డార్క్ బాక్సింగ్ సెటప్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు మంచి పేస్ తీసుకొచ్చింది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇన్నాళ్లు వేరే దర్శకుల కథలకు ప్రాణం పోసిన కార్తికేయ, ఇప్పుడు తనే మెగాఫోన్ పట్టి కెమెరా వెనుక, ముందు బాధ్యతలు తీసుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి. టాలెంటెడ్ యాక్టర్ గా పేరున్న ఈ యంగ్ హీరోకు బాక్సాఫీస్ దగ్గర సరైన కమర్షియల్ బ్రేక్ వచ్చి చాలా కాలమే అయింది. మరి ఈ బాక్సింగ్ డ్రామాతో డైరెక్టర్ గా, హీరోగా తన టైటిల్ కు తగ్గట్టుగానే ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.