యువహీరో బస్తీ మే సవాల్
కార్తీక్ ఆర్యన్ - అజయ్ దేవగన్ అక్టోబర్ 2026లో మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. కార్తీక్ ఆర్యన్- శ్రీలీల జంటగా టి సిరీస్ నిర్మించిన మ్యూజికల్ డ్రామా వచ్చే ఏడాది అక్టోబర్ 1న విడుదల కానుంది.
By: Sivaji Kontham | 25 Nov 2025 3:00 AM ISTఒక పెద్ద హీరో సినిమా వస్తోంది! అంటే చిన్న హీరో సినిమా రిలీజ్ తేదీ గురించి కొంతైనా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్సులో ఉంది... అతడు చిన్న హీరో కాదు కానీ, రైజింగ్ హీరోగా నేటి జెన్ జెడ్ మనసులను గెలుచుకుని బాక్సాఫీస్ వద్ద తనకు ఎదురే లేదని నిరూపిస్తున్న హీరో. ఇప్పుడు 2026 అక్టోబర్ 1 తేదీని అతడు లాక్ చేసాడు. అక్టోబర్ 2న ఒక పెద్ద హీరో సినిమా వస్తుందని తెలిసి కూడా తన సినిమా రిలీజ్ తేదీని డేరింగ్ గా ప్రకటించాడు. ఇప్పుడు నువ్వా నేనా? అంటూ సాగే పోరులో గెలుపెవరిది? అన్న చర్చ సాగుతోంది.
హోరాహోరీ పోరులో పెద్ద హీరో అజయ్ దేవగన్ కాగా, యువతరం మెచ్చే హీరో కార్తీక్ ఆర్యన్. 2024లో ఈ ఇద్దరూ నటించిన సినిమాలు పోటీపడ్డాయి. దేవగన్ నటించిన సింగం 3 తో పోటీపడుతూ కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయా 3 బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా దాదాపు 330 కోట్లు పైగా వసూలు చేయగా, రోహిత్ శెట్టి- దేవగన్ ల సింగం 260కోట్లు మాత్రమే వసూలు చేసింది. రేసులో కార్తీక్ బ్లాక్ బస్టర్ కొట్టగా ప్రత్యర్థులు పూర్తిగా డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. దేవగన్ సినిమాకి అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేయడంతో అది కాస్ట్ ఫెయిల్యూర్ గా మారింది.
కార్తీక్ ఆర్యన్ - అజయ్ దేవగన్ అక్టోబర్ 2026లో మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. కార్తీక్ ఆర్యన్- శ్రీలీల జంటగా టి సిరీస్ నిర్మించిన మ్యూజికల్ డ్రామా వచ్చే ఏడాది అక్టోబర్ 1న విడుదల కానుంది. దీనికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. దీనికి టి-178 అని టైటిల్ పెట్టారు. మ్యూజిక్ బేస్డ్ లవ్ స్టోరి ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం ఆషిఖి ఫ్రాంఛైజీలో సినిమా. కానీ వివాదాల కారణంగా టైటిల్ మార్చారు.
అక్టోబర్ 2న దేవగన్ దృశ్యం 3 విడుదలవుతుంది. దేవగన్ విజయ్ సల్గావ్కర్ పాత్రలో బరిలో దిగుతాడు. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా, పనోరమా స్టూడియోస్ - వయాకామ్18 నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు కలుపుకుని వరుసగా రెండు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. సెలవులను రెండు సినిమాలు ఎన్ క్యాష్ చేసుకుంటాయని అంచనా.
