స్టార్‌డం కాపాడుకోవడం కోసం యంగ్ హీరో కష్టాలు..!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలతో స్టార్‌డం దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఈయన నటించిన 'చందు ఛాంపియన్', 'భూల్ భులయ్యా 3' సినిమాలు గత ఏడాది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
By: Ramesh Palla | 31 July 2025 5:00 PM ISTబాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలతో స్టార్‌డం దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఈయన నటించిన 'చందు ఛాంపియన్', 'భూల్ భులయ్యా 3' సినిమాలు గత ఏడాది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. నటుడిగా కార్తీక్ ఆర్యన్ స్టార్‌డం పెంచడంలో ఆ సినిమాలు కీలక పాత్రను పోషించాయి. ఆకట్టుకునే నటనతో పాటు మంచి పీఆర్ టీం ఉండటం వల్ల ఎప్పుడూ కార్తీక్ ఆర్యన్ గురించి మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. తద్వారా ఆయన ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకుంటాడు అనే టాక్ ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా పీఆర్ ను వినియోగిస్తున్న హీరో కార్తీక్ ఆర్యన్ అంటూ బాహాటంగానే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏదో రకంగా మీడియాలో తన గురించి ప్రచారం జరగడంతో కార్తీక్ ఆర్యన్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
ఆషికి ప్రాంచైజీ కాదని క్లారిటీ
బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దక్కిన స్టార్‌డంను కాపాడుకోవడం అంత ఈజీ విషయం ఏమీ కాదు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ అదే కష్టంను ఎదుర్కొంటున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం అనురాగ్ బస్సు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఆషికి ప్రాంచైజీలో భాగంగా ఆ సినిమా రాబోతుందని మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాంచైజీకి ఈ సినిమాకు సంబంధం లేదని, ఈ సినిమాకు మరో టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని సొంతం చేసుకోవాలని కార్తీక్ ఆర్యన్ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే సినిమాను సాధ్యం అయినంత ఎక్కువగా పబ్లిసిటీ చేయడం జరిగింది. అంతా జరిగిన తర్వాత ఆషికి కాదంటూ ప్రకటన చేయడంతో జరిగింది.
సయ్యారా బాక్సాఫీస్ జోరు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం దృష్టి సయ్యారా సినిమా వైపు ఉంది. దాన్ని అసలైన ఆషికి ప్రాంచైజీ మూవీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా స్థాయిలో ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేస్తున్న సినిమా ఉండక పోవచ్చు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సయ్యారా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు మించి వసూళ్లు చేసిందనే వార్తలు వస్తున్నాయి, త్వరలోనే సయ్యారా రూ.500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఇలాంటి సమయంలో కార్తీక్ ఆర్యన్ సినిమాను జనాలు పట్టించుకుంటారా.. వచ్చిన తర్వాత ఎక్కువ శాతం మంది సయ్యారా సినిమాతో పోల్చరా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలతో పాటు పీఆర్ టీంతో స్టార్‌డం క్రియేట్ చేసుకున్న కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం కోసం కష్టాలు పడుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్తీక్ ఆర్యన్ సినీ కెరీర్
కార్తీక్ ఆర్యన్ కెరీర్ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2011లో ప్యార్ కా పంచ్నామా సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలోని కార్తీక్ ఆర్యన్ నటన ఆకట్టుకుంది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేశాడు. అయితే స్టార్‌డం మాత్రం వెంటనే రాలేదు. ఆఫర్లు వచ్చినంత ఈజీగా ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కలేదు. చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి, మరో వైపు పెద్ద సినిమాలు కాకుండా ఎక్కువ శాతం చిన్న సినిమాలు చేయాల్సి వచ్చింది. 2022లో భూల్ భులయ్యా 2 సినిమా తో కార్తీక్ ఆర్యన్ దశ తిరిగింది. కరోనా సమయంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ దృష్టి ఆకర్షించాడు. అక్కడ నుంచి పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
