హిట్ కాంబినేషన్ ఏకంగా ఐదవసారి!
కార్తీక్ ఆర్యన్-లవ్ రంజన్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ ఈ కాంబోలో తెరకెక్కిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించినవే.
By: Srikanth Kontham | 27 Sept 2025 12:00 PM ISTకార్తీక్ ఆర్యన్-లవ్ రంజన్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ ఈ కాంబోలో తెరకెక్కిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించినవే. `ప్యార్ కా పంచ్ నామా`,` ప్రాంచైజీ`, `ఆకాష్ వాణీ`, `సోనీ కీ టిటు కి స్వీటీ` లాంటి విజయాలతో హిట్ కాంబోగా బాలీవుడ్ లో ముద్ర పడిపోయింది. కార్తీక్ ని పరిశ్రమకు పరిచయం చేసింది కూడా లవ్ రంజనే. కార్తీక్ తొలి సినిమా `ప్యార్ కా పంచ్ నామా` అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతోనే బాలీవుడ్ కి పరిచమయ్యాడు. తొలి సినిమా విజయంతో కార్తీక్ కి మంచి అవకాశాలు అందుకున్నాడు.
బిజీగా ఉన్నా అతడి కోసం:
అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్థిరపడిగలిగాడు. ఈ నేపథ్యంలో హీరోగా అవకాశం ఇచ్చిన లవ్ రంజన్ తోనే ఐదవ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వాస్తవానికి కార్తీక్ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నాడు. పెద్ద పెద్ద దర్శకులతో అవకాశాలు అందుకుంటున్నాడు. బడా బ్యానర్లు అతడిపై కోట్లు గుమ్మ రిస్తున్నాయి. అయినా తనని హీరోగా పరిచయం చేసిన లవ్ రంజన్ తో మరోసారి పనిచేయాలని భావంచి ప్రాజెక్ట్ లాక్ చేసాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
యవ హీరోకి జోడీగా శ్రీలీల:
మునుపటి చిత్రాల్లాగే బలమైన వినోందం, సంగీతం కామెడీ ఎంటర్ టైగనర్ గా మలుస్తున్నారు. అన్ని అనుకు న్నట్లు జరిగితే వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో `ఆశీకీ 3` తెరకెక్కుతోంది. ఇందులో ఆర్యన్ కి జోడీగా తెలుగు నటి శ్రీలీల నటిస్తోంది. అలాగే `తూ మేరీ మేన్ తేరా మేనీ తేరా తూ మేరీ` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూడేళ్ల గ్యాప్ తర్వాత:
వచ్చే ఏడాదిలో `ఆశీకీ 3` రిలీజ్ కానుంది. అనంతరం లవ్ రంజన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. లవ్ రంజన్ కూడా డైరెక్టర్ గా సినిమా చేసి మూడేళ్లు అవుతుంది. `తూ జోతీ మేన్ మక్కర్` తర్వాత మరో సినిమా తెరకె క్కించలేదు. మధ్యలో రైటర్ గా, నిర్మాతగా కొన్ని సినిమాలకు పని చేసాడు. డైరెక్టర్ గా కొంత మంది హీరోలతో అవకాశాలు వచ్చినా తానే తీసుకోలేదు. ఇలాంటి తరుణంలో మరోసారి కార్తీక్ ని తన హీరోగా చేసుకోవడం విశేషం.
