కొత్త వివాదంలో బాలీవుడ్ యంగ్ హీరో
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా ఇట్టే బయటకు వస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 10 Jan 2026 8:00 AM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా ఇట్టే బయటకు వస్తున్నాయి. సెలబ్రిటీలు ఏదైనా ఫోటోను పోస్ట్ చేయడం ఆలస్యం, వెంటనే వారెక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఎవరి కోసం అక్కడికి వెళ్లారు? ఎవరెవరు వెళ్లారు ఇలా అన్నీ ఆరా తీసి ఎవరికి నచ్చింది వారు చెప్తూ ఆ సెలబ్రిటీ గురించి కామెంట్స్ చేస్తుంటారు.
వెకేషన్ కు గోవా వెళ్లిన కార్తీక్ ఆర్యన్
అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా సెలెక్టివ్ గా పోస్టులు పెడుతుంటారు. రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రోలర్లకు టార్గెట్ గా మారారు. వాస్తవానికి కార్తీక్ ఆర్యన్ వెకేషన్ కోసం గోవాకు వెళ్లి, అక్కడ్నుంచి ఓ బీచ్ లో వాలీబాల్ కోర్టు, మిగిలిన అన్ని సౌకర్యాలున్న విహారయాత్రను ఆస్వాదిస్తూ కనిపించే ఓ స్టోరీని పోస్ట్ చేశారు.
18 ఏళ్ల కరీనాతో రిలేషన్?
అయితే ఇంచుమించు అలాంటి ఫోటోనే 18 ఏళ్ల కరీనా కబిలియుటే అనే అమ్మాయి కూడా తన ప్రొఫైల్ లో పోస్ట్ చేయడంతో ఆ ఇద్దరూ ఒకే చోటు నుంచి ఈ పోస్టులు చేశారని, మరియు వారిద్దరి పోస్టుల్లో చాలా సారూప్యతలు ఉండటాన్ని అందరూ గమనించారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ గురించి నెట్టింట తెగ పుకార్లు వ్యాపిస్తున్నాయి. 35 ఏళ్ల కార్తీక్ ఆర్యన్ ను 18 ఏళ్ల అమ్మాయి కరీనాతో ముడిపెట్టడం వల్ల ఈ విషయం మరింత వివాదాస్పదంగా మారింది.
కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ పుకార్లు వ్యాపించడం మొదలుపెట్టాయో అప్పట్నుంచి అందరూ కార్తీక్ ఆర్యన్‌ను ఉమెనైజర్ అంటూ ట్రోల్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మీడియాలో మాత్రం ఓ వర్గం కార్తీక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కార్తీక్ ఫేమ్ పెరుగుతుండటం చూసి తట్టుకోలేని నెపో క్లబ్ వాళ్లే అతనిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారని అంటున్నారు. అయితే కామెంట్స్ కు మరికొందరు కౌంటర్ ఇస్తూ నెపో కిడ్ అయిన అర్జున్ కపూర్, అతని కంటే పెద్దదైన మలైకా అరోరాతో డేటింగ్ చేసినప్పుడు అతనిపై కూడా ఇలానే విమర్శలొచ్చాయని గుర్తు చేస్తున్నారు.
