Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి కలిసిరాని కొత్త ఏడాది ఆరంభం..

కొత్త ఏడాది ప్రారంభంలోనే ఒక స్టార్ హీరో వరుసగా విమర్శలు ఎదుర్కోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

By:  Madhu Reddy   |   13 Jan 2026 5:00 PM IST
స్టార్ హీరోకి కలిసిరాని కొత్త ఏడాది ఆరంభం..
X

కొత్త ఏడాది ప్రారంభంలోనే ఒక స్టార్ హీరో వరుసగా విమర్శలు ఎదుర్కోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. గత ఏడాది చివరిలో అనగా డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా అనన్య పాండేతో కలిసి నటించిన చిత్రం 'తు మేరీ మైన్ తేరా మేన్ తేరా తు మేరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా అటు రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా జోరు మొదలైన సమయంలో విడుదల కావడంతో ఈ సినిమాపై పెద్దగా అభిమానులు ఆసక్తి కనబరచలేదు. దాంతో కార్తీక్ - అనన్య పాండే కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా ఈ సినిమాతో నష్టాన్ని చవిచూశారు కార్తీక్ ఆర్యన్.

అయితే ఈ సినిమా నష్టం నుండి తేరుకోకముందే ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నాడు. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని వెకేషన్ కోసం గోవాకి వెళ్ళిన కార్తీక్.. అక్కడ బీచ్, వాలీబాల్ కోర్టు, విలాసవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఒక స్టోరీ షేర్ చేశారు.. అదే తరహా ఫోటోని 18 ఏళ్ల కరీనా కబిలియుటే అనే ఒక యువతి తన ప్రొఫైల్లో పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. రెండు పోస్టుల్లో లొకేషన్, బ్యాక్ గ్రౌండ్ చాలా దగ్గరగా ఉండడంతో ఇద్దరూ ఒకే చోట ఉన్నారనే అనుమానాలు మొదలయ్యాయి.

పైగా 35 ఏళ్ల కార్తీక్ 18 ఏళ్ల కరీనాల మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో కార్తీక్ ఒక ఉమనైజర్ అంటూ ట్రోలింగ్ మొదలయ్యింది. దీంతో 18 ఏళ్ల కరీనా తన ఇంస్టా బయోలో స్పందించింది." నాకు కార్తీక్ ఎవరో తెలియదు. నేను అతని గర్ల్ ఫ్రెండ్ కాదు. ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నానంటూ" క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే తన ప్రమేయం లేకపోయినా కార్తిక ఆర్యన్ మాత్రం ఈ కొత్త ఏడాది విమర్శలు ఎదుర్కోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

అయితే ఈ బాధ నుంచి తేరుకోక ముందే కార్తీక్ ఆర్యన్ మరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా టీనేజర్ తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో పడ్డాడు అని, అతడి పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ట్రోల్స్ ను తగ్గించడానికి అతని సొంత పీఆర్ టీం ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. అయితే ఈ గణాంకాలను చాలామంది నెటిజన్స్ నమ్మకపోయినా.. ఇలాంటి పుకార్లు మరింతగా పెరిగిపోతుండడంతో కార్తీక్ ఆర్యన్ పి ఆర్ టీం పై కూడా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా కార్తీక్ పై వస్తున్న పుకార్లను తగ్గించడానికి పిఆర్ బృందం ఇలాంటి పని చేసింది అని ఒక వర్గం నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కార్తీక్ ఆర్యన్ కి ఈ 2026 సంవత్సరం సానుకూలంగా ప్రారంభం కాలేదని మాత్రం చెప్పవచ్చు. ఒక సినిమా ఫ్లాప్.. తర్వాత మరోవైపు ఇలా విమర్శలు ఎదుర్కోవడంతో ఆ నష్టం నుండి కార్తీక్ ఎంతవరకు బయట పడతారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కార్తీక్ మరో మంచి సినిమాతో ఈ పుకార్లకు చెక్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.