'RX 100' హీరో ఎక్కడ?
'RX 100' సినిమాతో ఇండస్ట్రీలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
By: M Prashanth | 28 Oct 2025 2:00 AM IST'RX 100' సినిమాతో ఇండస్ట్రీలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. 'రా అండ్ రస్టిక్' హీరోగా, తన యాటిట్యూడ్‌తో నెక్స్ట్ యూత్ హీరో అవుతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. కానీ, ఆ ఫస్ట్ మూవీ ఇచ్చిన బూస్ట్‌ను కార్తికేయ సరిగ్గా వాడుకోలేకపోయాడనే చెప్పాలి.
'RX 100' తర్వాత, ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేయడానికి 'హిప్పీ', 'గుణ 369', '90ML' లాంటి సినిమాలు చేసినా, అవేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ 'RX 100' మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాయి. ఈ టైమ్‌లోనే అతను ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. హీరోగానే కాకుండా, విలన్‌గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. నాని 'గ్యాంగ్ లీడర్'లో, ఆ తర్వాత ఏకంగా తమిళ్ స్టార్ అజిత్ 'వలిమై'లో పవర్‌ఫుల్ విలన్‌గా నటించాడు.
ఆ సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, హీరోగా తన మార్కెట్‌ను మాత్రం మళ్ళీ పెంచుకోలేకపోయాడు. ఇలాంటి డైలమాలో ఉండగానే, 2023లో 'బెదురులంక 2012'తో చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో కార్తికేయ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడని, ఇకపై మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటాడని ఫ్యాన్స్ నమ్మారు. ఆ తర్వాత 2024లో 'భజే వాయు వేగం' అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చాడు. ఆ సినిమా కూడా 'పర్వాలేదు' అనిపించుకుంది, మరీ డిజాస్టర్ ఏమీ కాలేదు.
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. 'భజే వాయు వేగం' వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ కార్తికేయ నెక్స్ట్ సినిమా ఏంటనే దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ సైలెంట్ అయిపోయాడు. "బ్రో, అసలు ఉన్నావా?" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. ఒక యంగ్ హీరో, ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో నిలదొక్కుకోవాల్సిన టైమ్‌లో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం చాలా రిస్క్.
డీసెంట్ హిట్ తర్వాత స్పీడ్ పెంచాల్సింది పోయి, ఇలా పూర్తిగా కనిపించకుండా సైలెంట్ అవ్వడం అతని కెరీర్ కు మంచిది కాదనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు కార్తికేయ ప్లాన్ ఏంటి? ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కోసం సైలెంట్‌గా రెడీ అవుతున్నాడా? లేక కథల ఎంపికలో ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాడా అనే సందేహాలు ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. మరి సోషల్ మీడియాలో అయినా ఈ యువ హీరో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
