యువ హీరో సైలెంట్ మోడ్.. మరీ ఇంత గ్యాప్ అవసరమా?
గ్లామర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా ప్రయత్నాల చేసిన కార్తికేయ, ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు.
By: M Prashanth | 3 March 2026 8:00 PM ISTటాలీవుడ్‌లో 'RX 100' సినిమాతో ఒక ఊపు ఊపేసిన హీరో కార్తికేయ గుమ్మకొండ. మొదటి సినిమాతోనే మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ యంగ్ హీరో, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచారు. గ్లామర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా ప్రయత్నాల చేసిన కార్తికేయ, ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు.
చిన్న, మీడియం రేంజ్ హీరోలందరూ ఫ్లాపులు వచ్చినా ఏదో ఒక అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటే, కార్తికేయ మాత్రం పూర్తి సైలెంట్ అయిపోయారు. మొదట్లో ఈ హీరో స్పీడ్ చూసి అందరూ త్వరలోనే ఒక పెద్ద లీగ్‌లోకి వెళ్తారని భావించారు. కానీ హఠాత్తుగా మాయమవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
హీరోగానే కాకుండా అజిత్ 'వలిమై' వంటి భారీ ప్రాజెక్టులో విలన్‌గా చేసి నేషనల్ వైడ్ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. విలన్ రోల్‌లో మంచి మార్కులు పడ్డాక, తన మార్కెట్ పెరుగుతుందని అనుకుంటే లెక్కలు వేరేలా మారుతున్నాయి. నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలు గ్యాప్ తీసుకున్నా జనాల్లో నలుగుతున్నారు, కానీ కార్తికేయ విషయంలో క్లారిటీ కరువైంది.
చివరిగా 2024లో 'భజే వాయు వేగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఆ మూవీ తర్వాత తదుపరి సినిమా గురించి కనీసం చిన్న హింట్ కూడా లేదు. అంటే వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ మధ్యలో మిగతా యంగ్ హీరోలు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 22న తన పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు కార్తికేయ. రజినీకాంత్ జైలర్ సినిమాలోని "దేనికైనా టైమ్ రావాలి.. ప్రతి ఒక్కరికీ ఒక ఛాన్స్ వస్తుంది" అనే ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ థాంక్స్ చెప్పారు. ఆ పోస్ట్ చూసి ఫ్యాన్స్ త్వరలోనే కొత్త అప్‌డేట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ అదే నిశ్శబ్దం కొనసాగుతోంది. పర్ఫెక్ట్ కంటెంట్ దొరికే వరకు రిస్క్ చేయకూడదని బహుశా గట్టిగా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
కెరీర్ ప్రారంభంలో 'హిప్పి', 'గుణ 369', '90ML' వంటి సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఆ తర్వాత 'చావు కబురు చల్లగా', 'రాజా విక్రమార్క' వంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేసినా అవి మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి. ప్రతి హీరో లైఫ్ లో సక్సెస్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవ్వడం కామన్, కానీ లాంగ్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఆడియన్స్ మెమరీలో ఉండటం కష్టమవుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్‌లో స్పీడ్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
