పవన్ దర్శకుడితో యంగ్ హీరో జాంబీ మూవీ
అతడు తదుపరి బాలీవుడ్ లో మరో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడని తెలిసింది.
By: Sivaji Kontham | 26 Aug 2025 12:24 PM ISTకోలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు విష్ణు వర్ధన్. తళా అజిత్ కథానాయకుడిగా అతడు రూపొందించిన భారీ యాక్షన్ చిత్రం 'ఆరంభం' విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేగాక బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'పంజా' లాంటి భారీ చిత్రాన్ని రూపొందించారు. కొన్ని అనుకోని కారణాల వల్ల 'పంజా' ఫ్లాపైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా 'షేర్ షా' చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది కోలీవుడ్‌లోనే 'నెసిప్పయా' అనే యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించాడు.
అతడు తదుపరి బాలీవుడ్ లో మరో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడని తెలిసింది. హిందీ తెరను ఏల్తున్న ప్రముఖ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ తో జాంబీ మూవీని రూపొందించేందుకు విష్ణువర్ధన్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. అతడు వినిపించిన స్క్రిప్ట్ కార్తీక్ ఆర్యన్ ని ఎగ్జయిట్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన జాంబీ మూవీ అని తెలిసింది. కార్తీ పాత్ర యూనిక్ గా ఉంటుంది. అతడు ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అనన్య పాండే కథానాయిక. శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత `చక్ దే ఇండియా` ఫేం షిమిత్ అమీన్‌తో ఏరియల్ యాక్షన్ సినిమా కోసం కథా చర్చలు సాగిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇంతలోనే ఇప్పుడు విష్ణువర్ధన్ తో ప్రయోగాత్మక చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నాడని కథనాలొస్తున్నాయి.
కార్తీక్ బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాత్మక కథలకు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు `పంజా` దర్శకుడితో జాంబీ మూవీ పూర్తిగా తన కెరీర్‌లో విలక్షణమైన సినిమా.. లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడి `చందు చాంపియన్` లాంటి స్పోర్ట్స్ డ్రామాలో నటించిన కార్తీక్ కి ఇప్పుడు జాంబీ మూవీ పూర్తి వైవిధ్యాన్ని పరిచయం చేస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ సినిమాతో అతడు దక్షిణాది ఆడియెన్ కి కూడా కనెక్టవుతాడని భావిస్తున్నారు. 2026లో కార్తీక్- విష్ణువర్ధన్ సినిమా సెట్స్ కెళ్లేందుకు ఆస్కారం ఉందని తెలిసింది.
హాలీవుడ్ టు టాలీవుడ్...
జాంబీ కథలతో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో మిలా జోవిచ్ `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ సంచలన విజయం సాధించింది. ఈ సిరీస్ లో వచ్చిన ఐదారు సినిమాలు బంపర్ కలెక్షన్లతో రికార్డులు సృష్టించాయి. జాంబీ కథతోనే రూపొందించిన `ఐ యామ్ లెజెండ్` హాలీవుడ్ దిగ్గజ హీరో విల్ స్మిత్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాగా రికార్డులకెక్కింది. కోలీవుడ్ లో జయం రవి కథానాయకుడిగా జాంబీ మూవీని రూపొందించగా, టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ యువహీరో తేజ సజ్జాతో ప్రయోగాత్మకంగా `జాంబీ రెడ్డి` అనే జాంబీ మూవీని తెరకెక్కించారు.
