వృషకర్మ తర్వాత మెగా హీరోతో కన్ఫర్మ్..!
నాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ‘వృశకర్మ’ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ‘విరూపాక్ష’తో హిట్ అందుకున్న ఈ దర్శకుడు.. వృశకర్మ విడుదల తర్వాత ఓ మెగా హీరోతో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ నచ్చడంతో హీరో, దర్శకుడికి నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చినట్లు, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
By: Ramesh Palla | 26 Nov 2026 9:00 PM ISTనాగ చైతన్య హీరోగా నటించిన 'వృశకర్మ' సినిమా విడుదలకు రెడీ అయింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. నాగ చైతన్య మూవీ అనగానే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది, ఆ సినిమా ఇలా ఉండవచ్చు అనే ఊహ ఉండవచ్చు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం రివర్స్ అయింది. నాగ చైతన్యతో ఇలాంటి మూవీనా అంటూ అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఒక్కసారిగా దర్శకుడు కార్తీక్ వర్మ గురించి చర్చ మొదలైంది. ఈయన ఇంతకు ముందు విరూపాక్ష సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయినా కూడా మూడు ఏళ్ల గ్యాప్ తీసుకుని కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను రూపొందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కార్తీక్ వర్మ దర్శకత్వంలో...
ఇండస్ట్రీలో దర్శకుడిగా కార్తీక్ వర్మ దండు పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ పదేళ్ల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు రెండే. మూడో సినిమా త్వరలో రాబోతుంది. అంటే పదేళ్ల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు కేవలం మూడే మూడు సినిమాలు. ప్రతిభావంతుడు అయిన దర్శకుడు అయినప్పటికీ ఎందుకు ఈయన చాలా తక్కువ సినిమాలు చేశాడనే చర్చ కూడా మొదలైంది. కార్తీక్ వర్మ దండు ఎక్కువ కాలం స్క్రిప్ట్ మీద ఉంటున్నాడు. బెస్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు. వృశకర్మ సినిమా మేకింగ్ కోసం ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. అంతకు ముందు స్క్రిప్ట్ కోసం ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నాడు. కనుక ఈయన నుంచి మళ్లీ సినిమా రావాలంటే రెండు మూడు ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ వృశకర్మ సినిమా విడుదల అయిన వెంటనే మెగా హీరోతో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
విరూపాక్ష దర్శకుడి వృశకర్మ మూవీ...
ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో 'విరూపాక్ష' సినిమాను తీసి హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండు మరో మెగా హీరోతో సినిమాను చేస్తాడా లేదంటే మళ్లీ సాయి ధరమ్‌తో సినిమాను చేస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. వృశకర్మ సినిమా మేకింగ్ సమయంలోనే తన వద్ద ఉన్న ఒక స్క్రిప్ట్ ను ఆ మెగా హీరోకు ఇవ్వడం, ఆయన చదవడం నచ్చడం అని జరిగి పోయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా హీరోతో కార్తీక్ వర్మ దండు రూపొందించబోతున్న సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కార్తీక్ వర్మ దండు, హీరోకు సదరు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభించే విధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మెగా హీరోతో కార్తీక్ వర్మ దండు మూవీ...
కార్తీక్ వర్మ దండు విరూపాక్ష సినిమాలో కొత్త తరహా హర్రర్ ఎలిమెంట్స్‌ను చూపించిన విషయం తెల్సిందే. ఆ సినిమాను మించి వృశకర్మ సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయనే విశ్వాసంను ట్రైలర్ కలిగిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన వృశకర్మ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ట్రైలర్లో ఆమె పాత్రను ఎక్కువగా రివీల్ చేయలేదు. కానీ నాగ చైతన్య పాత్ర బాగుంటుంది అనే విశ్వాసం మాత్రం కలుగుతుంది. విలన్ పాత్రను రివీల్ చేయక పోయినప్పటికీ కచ్చితంగా అతడిని చూసి కచ్చితంగా ప్రేక్షకులు భయబ్రాంతులకు గురి అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి వృశకర్మ సినిమాతో మరోసారి కార్తీక్ వర్మ దండు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం, బ్యాక్ టు బ్యాక్ విజయాల కారణంగా మెగా కాంపౌండ్‌లో ఒక పెద్ద హీరోతో సినిమాను చేసే అవకాశం దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం ను సినీ వర్గాల వారు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
