Begin typing your search above and press return to search.

పాపులారిటీ కూడా సినిమా ఫలితానికి శాపమేనా..!

సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి కథను సరిగ్గా తెరకెక్కిస్తే బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 3:10 PM IST
పాపులారిటీ కూడా సినిమా ఫలితానికి శాపమేనా..!
X

సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి కథను సరిగ్గా తెరకెక్కిస్తే బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు హీరో ఇమేజ్, దర్శకుడి ఆలోచనలు, భారీ అంచనాల వల్ల కథలో మార్పులు జరుగుతుంటాయి. దీంతో మంచి కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కూడా ఇలాంటి చర్చే సోషల్ జరుగుతోంది.

శంకర్ ఒకప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే గొప్ప దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే అర్థం తెలియని రోజుల్లోనే ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. జీన్స్, భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. భారీ సెట్స్, సామాజిక అంశాలు, కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఆయన సినిమాలు వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ సినిమాని వార్తల్లో నిలిపాయి. కార్తీక్ సుబ్బరాజ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను.. గతంలో శంకర్‌కు ఒక కథ చెప్పినట్లు వెల్లడించారు. మధురై నేపథ్యంలో ఒక గ్యాంగ్‌స్టర్ కథ ఇచ్చానని అందులో.. ఒక గ్రామానికి వెళ్లే ఎన్నికల అధికారి చుట్టూ కథ ఉంటుందని ఆయన వివరించారు. ఈ కథలో రాజకీయ అంశాలు కూడా కీలకంగా ఉంటాయని తెలిపారు.

శంకర్‌కు ఆ కథ నచ్చిందని, స్క్రీన్‌ప్లే రాయాలని అడిగారని కార్తీక్ తెలిపారు. అయితే అప్పట్లో తాను మహాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేయలేకపోయానని చెప్పారు. దీంతో ఆ కథను శంకర్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ..శంకర్ వంటి దర్శకులు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు అంచనాలు పెరుగుతాయని.. భారీ బడ్జెట్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమా తీయాలనే ఆలోచనలు కూడా కథపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో కార్తీక్ కథకి తమ ఇమేజ్.. తీరులో మార్పులు చేసి గేమ్ చేంజెర్ సినిమా తీసి ఉంటారు అని అందరూ కన్ఫామ్ అవుతున్నారు.

కొంతమంది ఈ సినిమా శంకర్ బదులు కార్తీక్ సుబ్బరాజు ఎవరన్నా చిన్న హీరోలతో తీసి ఉంటే తప్పకుండా సూపర్ హిట్ అయి ఉండేది అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పాపులారిటీ కూడా సినిమా ఫలితానికి శాపమేనా అనిపించక మానదు.