చిరంజీవితో అతనా.. మనోళ్లకు కనెక్ట్ అవుతుందా?
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు.
By: M Prashanth | 7 Oct 2026 11:37 PM ISTమెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా చేరినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా చిరంజీవిని కలిసిన కార్తీక్.. ఆయన కోసం స్పెషల్ గా రెడీ చేసిన కథను వినిపించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటల పాటు స్టోరీ డిస్కషన్స్ సాగినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ కాంబోపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ అంటేనే డిఫరెంట్ స్టోరీలు, స్టైలిష్ మేకింగ్ గుర్తొస్తాయి. పిజ్జా, జిగర్తాండ, పేట, మహాన్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి. హీరోను కొత్తగా చూపించడం, కథలో ట్విస్ట్ లు, రెట్రో టచ్, మాస్ ఎలివేషన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమాను నడిపించడం ఆయన స్టైల్. ముఖ్యంగా పేటలో రజనీకాంత్ ను చూపించిన విధానం తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది.
అందుకే చిరంజీవి లాంటి మాస్ హీరోతో కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే ఇంట్రెస్ట్ రావడం కామనే. చిరంజీవి ఇమేజ్ కు కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ కలిస్తే స్క్రీన్ పై మంచి కాంబినేషన్ కనిపించే అవకాశం ఉంది. హీరో ఎలివేషన్స్, యాక్షన్, మ్యూజిక్, స్టైలిష్ సీన్స్ విషయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అసలు క్వశ్చన్ ఇక్కడే ఉంది.
కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ మొత్తం చిరంజీవి మార్క్ మాస్ సినిమాకు ఎంతవరకు సరిపోతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కార్తీక్ నార్మల్ గా స్టోరీని కాస్త కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తారు. కొన్ని సినిమాల్లో డార్క్ టోన్, స్లో నెరేషన్, ప్రయోగాత్మక స్క్రీన్ ప్లే కనిపిస్తుంటాయి. అదే స్టైల్ ను పూర్తిగా మెగాస్టార్ సినిమాకు తీసుకొస్తే మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా అనే చర్చ మొదలైంది.
అయితే కార్తీక్ తన కథను హీరోకు తగ్గట్టుగా మార్చుకునే దర్శకుడు కూడా. అందుకే చిరంజీవి కోసం రెడీ చేసిన కథలో మెగాస్టార్ ఇమేజ్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే మాత్రం ఆ కాంబినేషన్ స్ట్రాంగ్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, మాస్ ఇమేజ్ ను కార్తీక్ ఎలా యూజ్ చేసుకుంటారన్నది కూడా మెయిన్ అని చెప్పాలి.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ చిరంజీవికి నచ్చి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం అది స్పెషల్ ప్రాజెక్ట్ గా మారొచ్చు. సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడొచ్చు. అయితే కార్తీక్ తన స్టైల్ ను అలాగే ఉంచుతారా.. లేక చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు మాస్ టచ్ ఇస్తారా అనేది వేచి చూడాలి. అది సరిగ్గా కుదిరితే ఆ కాంబినేషన్ మనోళ్లకు కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి.
