ఫ్లాప్ డైరెక్టర్‌తో ఇలాంటి సాహసం చేస్తాడా?
అయితే ఇన్ని ఫ్లాపుల తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో షారూఖ్ నటిస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా కింగ్ ఖాన్ తో సుబ్బరాజు క్లోజ్ గా ఉన్న కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు లీక్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By: Sivaji Kontham | 29 Sept 2025 8:00 AM ISTకెరీర్ ఆరంభం కొన్ని క్లాసిక్ సినిమాలు తీసాడు కార్తీక్ సుబ్బరాజ్. రచయితగా, దర్శకుడిగా ఆల్ రౌండర్ పనితనంతో అందరి దృష్టిని ఆకర్షించిన సుబ్బరాజ్ ఇటీవల కొన్ని వరస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. లారెన్స్- ఎస్.జే సూర్యతో `జిగర్తాండ డబుల్ ఎక్స్, సూర్యతో రెట్రో పెద్ద ఫ్లాపులుగా మిగిలాయి. మాస్ కంటెంట్ కి ఆదరణ అంతంత మాత్రంగానే దక్కింది. ఇక ఎస్.శంకర్ తెరకెక్కించిన డిజాస్టర్ మూవీ `గేమ్ ఛేంజర్`కి కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. ఆశించినంత ప్రభావవంతంగా గేమ్ ఛేంజర్ ని తెరకెక్కించడంలో శంకర్- సుబ్బరాజు జోడీ విఫలమయ్యారు.
అయితే ఇన్ని ఫ్లాపుల తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో షారూఖ్ నటిస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా కింగ్ ఖాన్ తో సుబ్బరాజు క్లోజ్ గా ఉన్న కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు లీక్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జోడీ సైలెంట్ గా ఏదైనా మూవీ కోసం కలిసి పని చేస్తున్నారా? అంటూ సందేహించారు అభిమానులు. కానీ ఆ ఇద్దరూ ఒక వాణిజ్య ప్రకటన కోసం కలిసి పని చేస్తున్నారు. ప్రఖ్యాత కోలా ప్రకటన కోసం ఈ జోడీ కలిసి పని చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగా స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు లీకయ్యాయి.
అయితే సుబ్బరాజుతో ఖాన్ సన్నిహితంగా కనిపించడంతో ఈ జోడీ మధ్య అనుబంధంపై చర్చ సాగుతోంది. అట్లీ తర్వాత సుబ్బరాజు పనితనం ఖాన్ ని ఆకర్షించినట్టే కనిపిస్తోంది. అందువల్ల ఈ జోడీ ఏదైనా ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేసేందుకు అవకాశం ఉందని కూడా గుసగుస వినిపిస్తోంది. కేవలం కోలా ప్రకటన కోసం కింగ్ ఖాన్ ఒక సౌత్ దర్శకుడిని కలిసి పని చేస్తే అది దండగ. అలా కాకుండా అతడు ఒక సినిమా కోసం కలిసి పని చేస్తే కచ్ఛితంగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే, మెజారిటీ ప్రజలు వ్యతిరేకించే కోలా ప్రకటనల్లో నటించడం స్టార్లు మానుకోవాలి.
