Begin typing your search above and press return to search.

సుబ్బ‌రాజ్ తో ఛాన్స్ సీనియర్ కా? జూనియ‌ర్స్ కా?

కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ విభిన్నమైన స్టైలిష్ మేకింగ్‌తో దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   13 Oct 2026 1:01 PM IST
సుబ్బ‌రాజ్ తో ఛాన్స్ సీనియర్ కా?  జూనియ‌ర్స్ కా?
X

కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ విభిన్నమైన స్టైలిష్ మేకింగ్‌తో దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యంత బిజీ దర్శకుడిగా ఉన్నా? ఆయన కన్ను మాత్రం టాలీవుడ్ స్టార్లపై పడింది. సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో పాటు.. తదుపరి తరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నానిలతో సినిమాలు చేయాలనే ఆసక్తిని కార్తీక్ వ్యక్తం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ తదుపరి తెలుగు ప్రాజెక్ట్‌ను సీనియర్ హీరోలతో పట్టాలెక్కిస్తారా? లేక నేటితరం జూనియర్స్ హీరోలతో ముందడుగు వేస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో కార్తీక్ తెర‌కెక్కించిన చిత్రాలను గమనిస్తే రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లతో పని చేసిన అనుభవంతో పాటు ధనుష్, విక్రమ్ వంటి హీరోలతోనూ సరికొత్త కథలను తెరకెక్కించారు. ఈ నేప‌థ్యంలో కార్తీక్ ఏ స్థాయి హీరోనైనా తనదైన రీతిలో ప్రజెంట్ చేయగలరు అనే ధీమా అంద‌రిలో ఉంది.

ఒకవేళ కార్తీక్ సీనియర్ హీరోలైన చిరంజీవి ..నాగార్జునలకు ప్రాధాన్యత ఇస్తే అది సరికొత్త వింటేజ్ అడ్వెంచర్‌లా మారే అవకాశం ఉంది. చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ను, నాగార్జునలోని స్టైలిష్ లుక్‌ను కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ డార్క్ కామెడీ, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో జోడిస్తే థియేటర్లలో విజువల్ ఫీస్ట్ ఖాయం. సీనియర్ల అనుభవం, కార్తీక్ టేకింగ్ తోడైతే సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డులు నమోదవుతాయనడంలో సందేహం లేదు.

తదుపరి తరం హీరోలైన రామ్ చరణ్, నానిలతో సినిమా చేసే అవకాశం వ‌స్తే గనక కథాంశం మరింత ఆధునికంగా, నేటితరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండే అవకాశం ఉంది. రామ్ చరణ్‌లోని గ్లోబల్ మాస్ అప్పీల్‌కు కార్తీక్ సుబ్బరాజ్ ప్రయోగాత్మక ఆలోచనలు తోడైతే పాన్ ఇండియాలో పెద్ద సంచలనం అవుతుంది. అలాగే నాని లాంటి సహజ నటుడితో కార్తీక్ సుబ్బరాజ్ జోడీ కడితే విమర్శకుల ప్రశంసలు పొందే మరో క్లాసిక్ కల్ట్ సినిమా పుట్టుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్రస్తుతం కార్తీక్ సుబ్బ‌రాజ్ కోలీవుడ్‌లో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? తెలుగు హీరోలపై చూపించిన ప్రత్యేక ఆసక్తి రెండు పరిశ్రమల మధ్య మరో బలమైన వంతెనను నిర్మిస్తోంది. భాషా సరిహద్దులను చెరిపేస్తూ పాన్-ఇండియా సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆయన ఏ టాలీవుడ్ హీరోతో జట్టు కట్టినా అది రెండు భాషల్లోనూ భారీ ప్రాజెక్ట్‌గా మారుతుంది.

మ‌రి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మొదటి ఛాన్స్ సీనియర్లకు ఇస్తారా లేక జూనియర్లతో సీన్ రీ-క్రియేట్ చేస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. సుబ్బరాజ్ విజన్ ఏ హీరో వైపు అడుగులు వేస్తుందో? ఎలాంటి గ్రిప్పింగ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాడో? తెలుసుకోవాలని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.