Begin typing your search above and press return to search.

రజినీ- కమల్ మూవీ.. ఆ డైరెక్టర్ ఓకేనా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న తలైవర్ 173 ప్రాజెక్టుపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   14 Nov 2025 3:00 PM IST
రజినీ- కమల్ మూవీ.. ఆ డైరెక్టర్ ఓకేనా?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న తలైవర్ 173 ప్రాజెక్టుపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే అంతా ఓ రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారు. ఇద్దరు లెజెండరీ ఐకాన్స్ ఒకే సినిమాకు జతకట్టడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

నిజానికి ఆ సినిమాకు ముందు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అందుకు ఆయన సిద్ధమైనట్లు కూడా టాక్ వినిపించింది. కానీ రజినీ హీరోగా లోకేష్ తెరకెక్కించిన కూలీ మూవీ ఫెయిల్ అవ్వడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. లోకేష్ కనగరాజ్.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని గుసగుసలు వినిపించాయి.

అప్పుడే నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించింది. ప్రస్తుతం రజినీ కాంత్ తో జైలర్ 2 తీస్తున్న ఆయన.. ఆ తర్వాత కమల్- తలైవా మూవీ చేయనున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతలో సీనియర్ డైరెక్టర్ సుందర్.సి.. ఆ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో కమల్ హాసన్- రజినీ కాంత్ మూవీకి అంతా సెట్ అయిందని అనుకున్నారు.

కానీ సుందర్.సి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనుకోని పరిస్థితుల వల్ల భారమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మంచి అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. అలా భారీ ప్రాజెక్టు డైరెక్టర్ సీటు మళ్లీ ఖాళీ అయింది. దీంతో సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.

అతనే కార్తీక్ సుబ్బరాజ్.. కార్తిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయనను సెలెక్ట్ చేస్తే.. సరైన ఎంపిక అవుతుందని ఇప్పుడు చెబుతున్నారు. అయితే కార్తీక్ సుబ్బరాజ్.. ఇప్పటికే రజినీ కాంత్ తో పేట మూవీ తీశారు. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. పిజ్జా, జిగర్తాండ సినిమాలతో మెప్పించిన కార్తిక్ ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ చూడలేదు. చివరగా వచ్చిన రెట్రో కూడా క్లిక్ కాలేదు. అయితే అతనికి తలైవా మరో ఛాన్స్ ఇస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఆ విషయంలో మూవీ టీమ్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.